Wednesday, 21 April 2021

ఆ ప్రేమను మాటల్లో వర్ణించలేం.. ఈ సృష్టిలో అంతకుమించి లేదు.. అల్లు అర్జున్ వైఫ్ ఎమోషనల్ కామెంట్స్

పిల్లలపై తల్లిదండ్రులు కురిపించే ప్రేమకు లెక్కలు కట్టగలమా? అది ఎవ్వరి తరం కాదు. తల్లిదండ్రుల ఆప్యాయతలో పిల్లలు పొందే ఆనందం వెలకట్టలేనిది. చిన్నతనంలో తండ్రి గుండెలపై ఆటలాడుతూ పెరిగిన ఆ క్షణాలు ఏ ఒక్కరూ మరవలేరు. జీవితంలో ఆ జ్ఞాపలకను మించిన అనుభూతి ఇంకోటి ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పేద- ధనిక, సాధారణ- సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరిలో ఇది కామన్ పాయింట్. అలాంటి ఓ స్వీట్ మెమరబుల్ ఇన్సిడెంట్‌ని పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సతీమణి స్నేహ. ఓ వైపు సినిమాల్లో భాగమవుతూనే తన ఫ్యామిలీకి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన కొడుకు, కూతురుతో ఆటలాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అయినా ఇంట్లో మాత్రం చిన్న పిల్లాడిలా మారి పిల్లలతో అల్లరి పనులు చేస్తుంటారు బన్నీ. ఈ మధ్యనే హాలిడే ట్రిప్‌లో భాగంగా ఫ్యామిలీతో దుబాయ్‌ చుట్టేసిన ఆయన.. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ కూతురు అర్హతో ఆటలాడుతున్నారు. ఈ క్రమంలోనే తన గారాలపట్టిని గుండెలపై ఎక్కించుకొని ఫన్నీగా ఫీట్స్ చేస్తున్న ఓ వీడియోను అల్లు అర్జున్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై ''తండ్రి ప్రేమను మాటల్లో వర్ణించలేం.. ఈ సృష్టిలో అంతకుమించి ఇంకేమీ లేదు'' అంటూ కామెంట్ చేసింది స్నేహా. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. ముద్దుముద్దుగా తండ్రీకూతుళ్ళ ఆట చూసి మురిసిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా తన లేటెస్ట్ మూవీ 'పుష్ప' మూవీ వాయిదా పడటంతో ఇలా ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు అల్లు అర్జున్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gv3jyg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....