Wednesday, 21 April 2021

సినిమా రౌండప్: స్టార్ హీరోయిన్ విరహవేదన.. రామ్ చరణ్‌కి కండీషన్.. వెనక్కితగ్గిన మెగా మేనల్లుడు

రామ్ చరణ్‌కి కండీషన్ రామ్‌చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా చెర్రీ ద్విప్రాభినయం చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో చెర్రీ లుక్ టెస్ట్ చేశాకే తండ్రి పాత్రను ఇవ్వాలా వద్దా? అనేది కన్ఫర్మ్ చేస్తా అనే కండీషన్ పెట్టారట డైరెక్టర్ శంకర్. మాస్ మహారాజ్ 'షాక్' రిపీట్ రవితేజ- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'షాక్' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మిరపకాయ్' సినిమా చేసిన ఈ కాంబో ఇప్పుడు మరో సినిమా చేయనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో హరీష్ సినిమా కంప్లీట్ కాగానే రవితేజ- హరీష్ కాంబోలో సినిమా స్టార్ట్ కానుందట. స్టార్ హీరోయిన్ విరహవేదన తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ని పెళ్ళాడి ఆశ్చర్యపర్చిన ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తమ జోడీ హాట్ ఫొటోలతో ఎలా హల్చల్ చేస్తుందో తెలుసు కదా. ఈ నేపథ్యంలో తాజాగా ‘నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను’ అంటూ తన భర్తను ఉద్దేశించి ఓ ఫొటో షేర్ చేసింది ఈ బ్యూటీ. 'అఖండ' టీజ‌ర్ హవా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబోలో రాబోతున్న 'అఖండ' మూవీ విడుదలకు ముందే ట్రెండ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో పలు రికార్డులు తిరగరాస్తోంది. ప్రేమ గుడ్డిదే కానీ.. నితిన్- నభా నటేష్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ప్రేమ గుడ్డిదే. కానీ, వివక్ష చూపించదు’ అంటూ శ్రీరామనవమి కానుకగా నితిన్‌, నభ స్టిల్‌ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నితిన్‌ అంధుడిగా నటిస్తున్నాడు. వెనక్కి తగ్గిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతున్న సినిమా 'రిపబ్లిక్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని ముందుగా ప్రకటించినట్లు జూన్ 4 విడుదల చేయడం లేదట. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n9KWjr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....