Sunday, 21 February 2021

ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న ప్రియా ప్రకాష్.. నా కల నిజమైందన్న వింకీ బ్యూటీ

కన్నుగీటి నేషనల్‌ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్న మలయాళ బ్యూటీ తొలిసారి తెలుగు తెరపై అలరించబోతోంది. నితిన్ సరసన '' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బ్యూటీ నిన్న (ఆదివారం) జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. రెడ్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో ఈవెంట్‌కి రావడంతో కెమెరా కళ్లన్నీ ఆమెపైనే పడ్డాయి. ప్రియా స్పీచ్ ఇస్తుంటే తెలుగు ప్రేక్షకులు గోల గోల చేస్తూ హుషారెత్తిపోయారు. ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. ''ఆడియెన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు సెకండ్ హోమ్ అయిపొయింది. నిజంగా ఈ సినిమా నాకు బెస్ట్ లాంచ్ లాంటిది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు, డైరెక్టర్ చంద్రశేఖర్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నితిన్ చాలా మంచి కో స్టార్, ఆయనతో నటించడం కూడా నాకు ఒక మంచి అనుభవం. చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద స్టార్స్‌తో స్టేజ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ కల ఈ రోజు నిజమైంది. ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేసినందుకు రాజమౌళి గారికి, వరుణ్ తేజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. సినిమాపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3btvU2x

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....