Monday, 1 February 2021

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? 3 డేస్ కలెక్షన్స్.. ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్! ప్రదీప్ హవా చూస్తే..

బుల్లితెర యాంకర్, హోస్ట్ హీరోగా పరిచయమైన మూవీ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. యంగ్ హీరోయిన్ అమృతా అయ్యర్‌‌తో కలిసి ప్రేమ పాఠాలు చెబుతున్న ఆయన మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళాడు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. విడుదలకు ముందు బెస్ట్ ప్రమోషన్స్ దక్కించుకున్న ఈ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 29వ తేదీన విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.8 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి మూడు రోజుల్లోనే ఆ ఫీట్ అధిగమించింది. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రోజుల్లో కలిపి 9.81 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పేర్కొంది చిత్రయూనిట్. ఈ మేరకు 'జనం మెచ్చిన సినిమా' అంటూ కలెక్షన్స్ వివరాలతో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఒకే రెస్పాన్స్‌తో ఈ మూవీ కలెక్షన్ల ప్రవాహం సృష్టిస్తుండటం విశేషం. అలా మొదటి వీకెండ్‌ని సాలిడ్ కలెక్షన్స్‌తో ముగించడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటికే హీరో ప్రదీప్ ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పగా.. తాజాగా ఈ మూడు రోజులు మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని పేర్కొంది హీరోయిన్ అమృతా అయ్యర్. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oDCSGK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....