Sunday, 24 May 2020

YS Jagan ‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్.. త్వరలో ఇద్దరి భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ ఫోన్ చేశారు. త్వరలోనే సీఎం జగన్, చిరంజీవి భేటీ కానున్నారు. సినీ పరిశ్రమలకు మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందంటూ మెగాస్టార్ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి ట్వీట్లు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరఫున వారికి ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలియచేశాను. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో కలిసి త్వరలోనే సీఎం జగన్‌ను కలవటం జరుగుతుంది.’’ అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు మరణం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. ‘మా’ వివాదంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి సమస్యపై అయినా చిరంజీవి ముందుండి పరిష్కరిస్తున్నారు. సినీ పరిశ్రమలో సమస్యలకు ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన చిరంజీవి.. లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవలే మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్)తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌తో సైతం త్వరలో భేటీ కానున్నట్లు చిరంజీవి వెల్లడించారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాయి. ఈ తరుణంలో చిరంజీవి ఇప్పటికే ఓసారి సీఎం జగన్‌తో భేటీ కావడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ సమస్యలకు సంబంధించి మరోసారి భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XrKvoe

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...