Tuesday, 26 May 2020

Kamal Haasan: కమల్ హాసన్‌ డేటింగ్ రూమర్స్‌.. ఆయనతో రిలేషన్‌షిప్‌‌పై పూజా కుమార్ క్లారిటీ

స్టార్ హీరో కమల్ హాసన్‌పై గత కొన్నిరోజులుగా డేటింగ్ రూమర్స్ గుప్పుమంటున్నాయి. హీరోయిన్ గౌతమితో విడిపోయాక ఆయన మరో నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌ గురించి జనాల్లో చర్చలు మొదలయ్యాయి. తరచుగా ఫ్యామిలీ ఫంక్షన్‌లకు హాజరవుతుండటం, వారి కుటుంబ సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో తాజాగా ఈ ఇష్యూపై స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది పూజా కుమార్. ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. గత ఐదారేళ్లుగా కమల్ సార్‌తో కలిసి పని చేస్తున్నా కాబట్టి తనకు కమల్‌తో పాటు వారి ఫ్యామిలీ మెంబెర్స్, బ్రదర్స్, ఆయన కూతుర్లు అందరూ బాగా పరిచయమని చెప్పింది. అందుకే వారి కుటుంబ వేడుకలకు హాజరవుతున్నా తప్పితే అంతకుమించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని పూజా కుమార్ పేర్కొంది. తాను కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయనున్నట్లు అనుకుంటున్న దాంట్లో నిజం లేదని చెప్పింది. Also Read: అలాగే కమల్ గురించి మాట్లాడుతూ.. ఓ గొప్ప క్రియేటర్ అని అలాగే ఓ మెస్మరైజర్ అని చెప్పుకొచ్చింది పూజ. ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడని, తనకు జీవితంలో ఓపిక గురించి కూడా నేర్పించింది ఆయనే అని తెలిపింది. ''విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం 2'' చిత్రాల్లో కమల్‌తో కలిసి పూజా కుమార్ నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3d6qUAO

No comments:

Post a Comment

'Markets Are Testing Investors' Patience'

'This is also a time when you realise that short-term trading and dabbling in derivatives may result in financial losses.' from re...