Sunday, 3 May 2020

నా టార్గెట్ అదే.. కానీ దారి ఇటు మళ్లింది: సీక్రెట్స్ రివీల్ చేసిన రష్మిక మందన

అదేంటో..! జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. యాక్టర్ కావాలనుకున్నవాళ్ళు డాక్టర్ వాడుతారు, డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు వ్యాపార రంగంలో స్థిరపడుతుంటారు. అయితే ఇలాంటివన్నీ దేవుడు రాసిన నుదుటిరాత అని అంటుంటారు పెద్దలు. ఎవరెన్ని ఊహించుకున్నా, తన కేరీర్ అలా సాగాలి, ఇలా సాగాలి అని ఎంత ప్రయత్నించినా చివరకు నుదిటిపై ఏది రాసిపెట్టి ఉందో అదే అవుతారని అంటుంటారు. క్రేజీ హీరోయిన్ రష్మిక విషయంలోనూ అదే జరిగిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. తాను చదివింది జర్నలిజం కోర్సు అయితే.. చివరకు సినీ రంగంలో ఇలా సెట్టయ్యానని అంటోంది . ఇష్టమైన చదవు పూర్తిచేశాక, నటనను కెరీర్‌గా ఎంచుకున్నానని చెప్పిన ఆమె.. తనకు ఊహ తెలిసినప్పటి నటనపై ఆసక్తి ఉందని తెలిపింది. మంచి జర్నలిస్ట్‌ కావాలనే టార్గెట్ పెట్టుకొని జర్నలిజం పూర్తిచేశాను. కానీ ఆ తర్వాత సినిమారంగం పట్ల మక్కువ పెరిగింది. నేరుగా సినిమాల్లో ఛాన్స్ రాదని, తొలుత మోడలింగ్‌ రంగంలోకి వెళ్లి ఆ తర్వాత సినిమా అవకాశాలు పట్టేశానని పేర్కొంది ఈ కన్నడ కస్తూరి. Also Read: తొలి కన్నడ చిత్రం ‘కిర్రాక్‌ పార్టీ’ ఘనవిజయం సాధించడంతో.. ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చేశాయి. ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటూ కెరీర్ ముందుకు సాగిస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చింది. తెలుగులో 'ఛలో' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ ''గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు'' రూపంలో భారీ విజయాలు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '' సినిమాలో నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b2KOe1

No comments:

Post a Comment

'Bengali Nationalism May Help Mamata Retain Power'

'If the BJP becomes our political identity, our political face, if we are represented by the BJP, then what happens to our identity as B...