గత రెండు మూడు రోజులుగా సినీ నటుడు, జనసేన పార్టీ నేత చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహాత్మ గాంధీని చంపిన నాథురాం గాడ్సే జయంతి రోజు ఆయన గురించి ఓ ట్వీట్ చేసి చర్చలకు తెరలేపారు నాగబాబు. గాడ్సే కూడా ఎంతో దేశభక్తి గలవాడని ఆయన పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది. ఒక్కసారిగా రాజకీయ ప్రత్యర్ధులు విరుచుకుపడటం స్టార్ చేశారు. నాగబాబు అభిప్రాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో గాంధీని అవమానించడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు నాగబాబు. అయితే ఇంతటితో ఆగక మరోసారి గాంధీ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన బతికుంటే దేశభక్తులందరినీ గౌరవించాల్సిందిగా చెప్పేవారని మరో ట్వీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు నాగబాబు. దేశం కోసం త్యాగం చేసిన వారి పేర్లు తప్ప ముఖాలు గుర్తుకురావడం లేదని, కరెన్సీ నోట్లపై వారి ముఖాలను ముద్రించి భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంటూ మరో వివాదానికి ఊతమిచ్చారు. దీంతో ఈ ఇష్యూ రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారితీసింది. ఈ ట్వీట్స్ వెనుక జనసేన పార్టీ హస్తం ఉందని కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంటరైన .. అధికారిక లేఖ విడుదల చేశారు. Also Read: ''జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే కానీ.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని చెప్పాను. ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధంలేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక పత్రం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం'' అని ఆ లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కరోనా కారణంగా ప్రజలు నానాకష్టాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో వారికి సహాయం చేయడం తప్ప ఏ ఇతర అంశాల జోలికి పోకూడదని పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. దీంతో ఈ ఇష్యూ గురించిన చర్చలు మరింత ముదిరాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZwdNEV
No comments:
Post a Comment