లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదలు పూట గడుపుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నా అది పేదలందరికీ చేరని పరిస్థితి. అందుకే, మనసున్న ప్రతి ఒక్కరూ తమవంతుగా పేదలకు అండగా నిలుస్తున్నారు. ఆహారం అందిస్తున్నారు. ఇలా పేదలకు అండగా నిలుస్తున్నవారిలో సినీ తారలు కూడా ఉన్నారు. వారిలో సీనియర్ నటుడు మంచు ఒకరు. ఇప్పటికే ఆయన పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. తన సొంత జిల్లా చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రోజుకు రెండు పూటలా ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇలా ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. ఇది కాకుండా ఎనిమిది టన్నుల కూరగాయలను ఈ గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా సరఫరా చేశారు. ఆయా గ్రామాల్లో పేదలకు తమ సాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, ఈ సాయాన్ని అవకాశమున్న ప్రతి ఒక్కరూ చేయాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ట్వీట్ చేశారు. Also Read: ‘‘నేను నటుడిగా మద్రాసులో ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒక్కపూట భోజనం లేక ఎన్నో రోజులు గడిపాను. అంటే, ప్లేట్ మీల్ 80 పైసలు.. అది లేక. అప్పుడు భగవంతుడిని ప్రార్థించాను. దేవుడా.. నన్ను మంచి నటుడిని చేయి, ఆ వచ్చిన డబ్బులతో పది మందికి భోజనం పెట్టే అవకాశాన్ని కలుగజేయమని. ఆయన ఇచ్చాడు.. ఈరోజున పది మందికి భోజనం పెట్టగలుగుతున్నాను. అంతమాత్రాన నేను గొప్పవాడిని కాను. అవకాశం ఉన్నవాళ్లు ఆకలితో ఉన్నవాళ్లకు ఒక్కపూట భోజనం పెడితే మీకంటే గొప్పవాళ్లు ఎవరూ లేరు. అదే మీకు శ్రీరామ రక్ష’’ అని మోహన్ బాబు తన వీడియోలో పేర్కొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35pT0Uk
No comments:
Post a Comment