ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం రూపొందిన ‘వి’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలా పడిన నాచురల్ స్టార్ .. ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. రీసెంట్‌గా 'టక్ జగదీష్' చేసి మిశ్రమ స్పందన పొందిన ఈ హీరో ఎలాగైనా సాలిడ్ హిట్ పట్టాలని డిఫరెంట్ కథా చిత్రం '' మూవీ చేస్తున్నారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. పిరియాడికల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి మెలోడీ సాంగ్ స్పెషలిస్ట్ మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమాతమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఇప్పటికే విడుదల చేసిన టీజర్, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఈ ప్రోమో వీడియోలో అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా నాని క్యారెక్టరైజేషన్ చూపించారు. సింగరాయ్ ఎలివేషన్ పీక్స్‌లో వర్కవుటైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఈ మూవీపై నాని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32LyOit
No comments:
Post a Comment