Friday, 3 December 2021

మరోసారి RRR ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. ఈసారైనా టైమ్‌కి వస్తారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ RRR. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ సినిమా విడుల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అధికారికంగా చెప్ప‌లేదు కానీ.. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింద‌ట‌. సినిమా వ్య‌వ‌ధి 3 గంట‌ల 6 నిమిషాల‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంతా బాగానే ఉంది కానీ... RRR ట్రైల‌ర్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి డిసెంబ‌ర్ 3న RRR ట్రైల‌ర్‌ను విడుల చేయాల‌ని అనుకున్నారు. కానీ.. ట్రైల‌ర్ క‌ట్ న‌చ్చ‌లేదు.. మ‌రేదైనా సాంకేతిక కార‌ణాలేమో ఏమో కానీ ట్రైల‌ర్ రిలీజ్‌ను వాయిదా వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్ ఊసురుమ‌నుకున్నారు. జ‌క్క‌న్న ఎందుకు ఏదీ అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేయ‌డ‌ని అనుకున్న‌వాళ్లు కూడా ఉన్నారు. తాజా సమాచారం మేరకు డిసెంబర్ 9న RRR ట్రైలర్ విడుదల చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి త‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ RRR కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ట్రైల‌ర్ విడుద‌ల కోసం ఇటు మెగా.. అటు నంద‌మూరి అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారైనా జక్కన్న అనుకున్న టైమ్‌కి వస్తాడా? అనేది తెలియడం లేదు. అయితే ఈసారి మాత్రం పక్కా అని సినీ వర్గాలంటున్నాయి. టాలీవుడ్‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రో వైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి స్టార్స్ కూడా నటించారు. క్రేజీ కాంబినేష‌న్స్‌తో రూపొందుతోన్న సినిమా కావ‌డం, ఇది వ‌ర‌కు రిలీజైన ప్రోమోస్‌, సాంగ్స్ అన్నీ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచేశాయి. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత నుంచి ప్ర‌మోష‌న్స్‌ను మ‌రింత వేగవంతం చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ ఇప్ప‌టికే నిర్ణ‌యించుకుంది. చార్టెడ్ ఫ్లైట్‌లో ఇండియాలోని ప్ర‌ధాన న‌గరాల్లో ప‌ర్య‌టిస్తూ RRRను ప్ర‌మోట్ చేయాల‌ని ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ఆలియా, అజ‌య్ దేవ‌గ‌ణ్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌హా ఎంటైర్ యూనిట్ స‌భ్యులు నిర్ణ‌యించుకున్నారు. భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ కూడా జ‌రుగుతుంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూ.400 కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు ప‌ది వేల థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉందని, ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్‌లో విడుద‌ల కాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. 1920 కాల‌పు బ్రిటీష్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌ల‌వ‌ని ఇద్ద‌రు యోధులు క‌లిసి బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కమౌళి రాజ‌మౌళి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GccflI

No comments:

Post a Comment

'Coming Months Could Be Eventful...'

'The shifts in US involvement in global conflicts and geopolitical alliances could introduce uncertainties.' from rediff Top Inter...