సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌లు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. మధ్యలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రేణూ దేశాయ్ సైలెంట్ అయిపోయింది. అంతకు ముందు అందరికీ సాయం చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో సాయం కోరిన నెటిజన్లకు వీలైనంత సాయం చేసింది. మధ్యలో కరోనా మరణాలపై రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది. కరోనా దెబ్బకు షూటింగ్‌లు మానేసి ఇంట్లోనే కూర్చుండిపోయింది. అందుకే మధ్యలో డ్రామా జూనియర్స్ షోను మానేసింది. కరోనా వల్లే షూటింగ్‌కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక కరోనా వల్ల తన సినిమా షూటింగ్‌లు కూడా మూలనపడ్డాయి. రైతు అనే సినిమా కోసం అయితే రెండేళ్లుగా రేణూ దేశాయ్ ఎదురుచూస్తూనే ఉంది. ఇక వెబ్ సిరీస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. కానీ అది కూడా మూలనపడిపోయింది. కరోనా దెబ్బతో షూటింగ్‌లకు వెళ్లడమే మానేసింది రేణూ దేశాయ్. తాజాగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య ప్రతిభను అందరికీ పరిచయం చేసింది. ఆద్య గిటార్ వాయిస్తూ పాట పాడటం కనిపిస్తోంది. దీంతో ఆద్య టాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. పవర్ స్టార్ కూతురా? మజాకా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక అకీరా నందన్‌కు కూడా మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టమన్న సంగతి తెలిసిందే. పియానోను అద్బుతంగా వాయిస్తాడు. బాస్కెట్ బాల్ ఆటలోనూ అకీరా నందన్ ఆరితేరిపోయాడు. అడివి శేష్‌తో కలిసి అకీరా బాస్కెట్ బాల్‌ను ఆడుతుంటాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3prVSKL
No comments:
Post a Comment