ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా ''. తగ్గేదే లే అంటూ రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన సుక్కు.. డిసెంబర్ 12వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి పుష్ప చిత్ర యూనిట్ అందరూ హాజరై వేదికపై సందడి చేశారు. ఈ సినిమాలో మంగళం శ్రీను పాత్రలో నటించిన అయితే తన ఎనర్జిటిక్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. వేదికపై సునీల్ మాట్లాడుతూ.. ''ఇదే వేదికపై అల వైకుంఠపురంలో సినిమా గురించి ఒక మాట చెప్పాను.. చక్కటి విందు భోజనంలా ఉంటుంది మీరు టికెట్ కొట్టుకుని వస్తే చాలు.. పండక్కి మీ ముందుకు వస్తున్నాము అన్నాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా ఇది పెళ్లి తర్వాత వచ్చే రిసెప్షన్ లాంటి సినిమా. కక్క ముక్క బాగా ఉంటుంది. మంచి నాన్ వెజ్ మీల్స్ లాంటి సినిమా పుష్ప. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వారం రోజుల పాటు ఆ జ్ఞాపకాలన్నీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. సాధారణంగా ఎవరైనా విలన్ అవ్వాలంటే నేరుగా అయిపోతారు. కానీ నేను 300 సినిమాలు కమెడియన్‌గా చేసి.. అందులో 10 సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత ఇప్పుడు విలన్ అయ్యాను. దయచేసి నా ముందు సినిమాలను గుర్తుపెట్టుకుని ఈ సినిమా చూడకండి. సినిమాకెళ్లేటపుడు అల్లు అర్జున్ ఫోటో తీసుకెళ్ళండి. నా గతం గుర్తుకు వస్తే వెంటనే బన్నీ ఫోటో చూడండి. మీరు కొత్తగా చూస్తేనే కొత్తగా చేయగలను. ఖచ్చితంగా పుష్ప సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సుకుమార్, అల్లు అర్జున్‌గారికి కృతజ్ఞతలు'' అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ మాస్ రోల్ చేయగా.. పల్లెటూరు అమ్మాయిగా రష్మిక మందన నటిస్తోంది. సమంత స్పెషల్ సాంగ్ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oMqHe3
No comments:
Post a Comment