Thursday, 9 December 2021

Pushpa The Rise సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

ఐకాన్ స్టార్ , సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం . పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో డిసెంబ‌ర్ 17న‌ విడుద‌ల‌వుతుంది. ఇక ఓ వారం మాత్ర‌మే ఉంది. బ‌న్నీ డిఫ‌రెంట్ గెట‌ప్‌, సుకుమార్ టేకింగ్‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఫ్యాన్సీ, సినీ ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఇదంతా బాగానే ఉంది. అస‌లు సినిమా ర‌న్ టైమ్ ఎంత ఉండొచ్చు అని సినీ ప్రేమికులు అనుకుంటున్నారు. అంద‌రూ అంత ఆస‌క్తిని క‌న‌ప‌ర‌చ‌టానికి కార‌ణం.. మ‌న ద‌ర్శ‌కులే అనాలి. ఎందుకంటే మ‌న టాలీవుడ్‌లో కొంత మంది ద‌ర్శ‌కులు తాము చేసిన సినిమా కంటెంట్‌ను ఎడిట్ చేయాలంటే పెద్ద‌గా ఆసక్తి చూప‌రు. అలాంటి ద‌ర్శకుల లిస్టులో రాజ‌మౌళి ఒక‌రు. మ‌రొక‌రు డైరెక్ట‌ర్ సుకుమార్‌. పుష్ప‌ను ముందు ఓ సినిమాగానే చేయాల‌ని అనుకున్నారు సుక్కు. అయితే ఆయ‌న చేసిన రీసెర్చ్‌లో భాగంగా క‌లెక్ట్ అయిన కంటెంట్ అంతంటినీ ఒకే సినిమాలో చూపించ‌డం సాధ్యం కాదు. దీంతో ఆయ‌న నిర్మాత‌లు, హీరోను ఒప్పించి పుష్ప‌ను రెండు భాగాలుగా చేయడానికి ఒప్పించారు. అందులో మొద‌టి భాగం ది రైజ్‌. మ‌రి ఈ సినిమా సెన్సార్ పూర్త‌య్యింది క‌దా.. ర‌న్ టైమ్ ఎంత ఉండొచ్చు అనే సందేహం రాక మాన‌దు. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. మూవీ వ్య‌వ‌థి 2 గంట‌ల 59 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంట‌ల‌న్న‌మాట‌. ఇంత పెద్ద సినిమాను ఇప్పుడు ప్రేక్ష‌కులు చూస్తారా? అంటే కంటెంట్ బావుంటే ఎందుకు చూడ‌ర‌నేది సుకుమార్ వంటి ద‌ర్శ‌కులు చెబుతున్నమాట‌. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇక శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న శ్రీవ‌ల్లి అనే పాత్ర‌లో బ‌న్నీ ప్రేమికురాలిగా క‌నిపించ‌నుంది. అలాగే మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా, భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ అనే ఐపీఎస్ ఆఫస‌ర్‌గా.. మంగ‌ళం శ్రీను పాత్ర‌లో సునీల్‌.. దాక్షాయ‌ణి పాత్ర‌లో అన‌సూయ న‌టించారు. శుక్ర‌వారం ఈ సినిమా నుంచి స్పెష‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. స‌మంత ఈ స్పెష‌ల్ సాంగ్‌లో డాన్స్ చేయ‌డం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30dXVJX

No comments:

Post a Comment

'Don't Get Carried Away Signing A Trade Agreement'

'There is a lot of euphoria in the country after a trade agreement is signed. But it is an illusion for us. What is more important is ma...