ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబర్ 17న విడుదలవుతుంది. సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 6) విడుదలకానుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. ఇందులో సామి సామి అనే సాంగ్‌ను అల్లు అర్జున్, రష్మిక మందన్నలపై చిత్రీకరించారు. ఈ సాంగ్ కోసం రష్మిక మామూలుగా కష్టపడలేదు. కష్టపడటం అంటే మామూలుగా కాదండోయ్.. అని అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే.. డాన్స్ చేయడంలో అల్లు అర్జున్‌కు ఓ గ్రేస్ ఉంటుంది. ఆ గ్రేస్‌ను మ్యాచ్ చేయాలంటే ఆయనకు అపోజిట్‌గా ఉన్నవారు కూడా ఒళ్లు వంచాల్సిందే. సింపుల్‌గానే అనిపించే స్టెప్స్‌ను బన్నీ చేసేంత స్పీడుగా అందుకోవడం కోసం రష్మిక మందన్న ఏకంగా 18 గంటలు పాటు రిహార్సల్ చేసిందట. అప్పటికీ కానీ ఆమెకు పర్‌ఫెక్షన్ రాలేదట. పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న కనిపించనుంది. చిత్తూరు జిల్లా అమ్మాయిగా కనిపిస్తుంది. డీ గ్లామర్ పాత్ర. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నింటి కంటే భిన్నమైన పాత్ర. ఈ లుక్‌తో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగానే చూపిస్తూ రష్మిక సామి సామి డాన్స్‌లో బన్నీతో కలిసి స్టెప్పులేసింది. ఆ పాటలో రష్మిక గ్లామర్ పిక్స్ కూడా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో మరో స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసింది. త్వరలోనే ఆ పాట కూడా విడుదలవుతుంది. తొలిసారి సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసింది. స్పెషల్ సాంగ్స్‌ను ప్రేక్షకులకు నచ్చేలా షూట్ చేయడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఈ పాటను ఎలా తెరకెక్కించాడో అనేది అందరిలో ఆసక్తిని పెంచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. రెండు భాగాలుగా రూపొందుతోన్న పుష్ప మూవీలో మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న విడుదలవుతుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ అయితే, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. బన్నీ ఇందులో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Erg2em
No comments:
Post a Comment