ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి భరద్వాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా ఆమె తండ్రి సుదర్శన్ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈయన రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా కూడా సేవలు అందించారు. అనసూయ విషయానికి వస్తే.. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై తన హవాపే చాటుతుందామో. జబర్‌దస్త్ కామెడీ ప్రోగ్రామ్‌కు క్రేజ్ రావడంలో తనవంతు పాత్ర పోషించిన అనసూయ నటిగానూ వెండితెరపై సత్తా చాటింది. అన్నీ పాత్రలు చేసేయాలని కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. క్షణం, రంగస్థలం వంటి చిత్రాలు అందుకు ఉదాహరణలు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పుష్ప ది రైజ్ చిత్రంలోనూ అనసూయ దాక్షాయణి అనే మరో వెరైటీ పాత్రలో నటించింది. ఆ సినిమా ఈ నెల 17న విడులవుతుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Dr4jv9
No comments:
Post a Comment