మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ విష్ణు మంచు తీసుకున్న నిర్ణయం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే, ‘మా’ ఎన్నికల్లో విష్ణు మంచు, ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డారు. ఈ ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకున్నారు. విష్ణు మంచు వైపు సీనియర్ నరేష్ నిలబడి సపోర్ట్‌గా మాట్లాడితే, ప్రకాష్ రాజ్ వైపు మెగా బ్రదర్ నాగబాబు నిలబడ్డారు. మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. ఇక ఎన్నికల సమయంలో ఇంకా పెద్ద హడావుడే జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకాష్ రాజ్, నాగబాబు ఎన్నికలు జరిగిన తీరుని విమర్శిస్తూ తమ ‘మా’ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ రెండు రోజుల వ్యవధిలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున నిలబడి గెలిచిన శ్రీకాంత్ సహా 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ సమయంలో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు.. తాను సదరు రాజీనామాలను ఆమోదించనని, అందరం కలిసి ముందుకు వెళతామని అన్నారు. ఎన్నికలు జరిగి రెండు నెలలు అయ్యాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీమ్ సభ్యులు సమర్పించిన రాజీనామాలను విష్ణు ఆమోదించారు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని సదరు సభ్యులను కోరినప్పటికీ వారు అంగీకరించలేదని దీంతో ఆమోదించామని విష్ణు తెలిపారు. అలాగే నాగబాబు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి చేసిన రాజీనామాలను మాత్రం అంగీకరించలేదని అన్నారు విష్ణు. అలాగే ‘మా’ బిల్డింగ్‌కు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని ఓ వారం లేదా పదిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకుని ఆ ప్రకటనను తెలియజేస్తామని అన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ‘మా’ ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న తీరు అందరినీ విస్మయ పరిచాయి. ‘మా’ రచ్చ మీడియాకి కూడా ఎక్కింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారి ప్రవర్తించిన తీరుని, అలాగే మోహన్ బాబు సభ్యులను దూషించి, ప్రవర్తించిన విధానం తప్పు పట్టడమే కాకుండా లోకల్.. నాన్ లోకల్ సమస్యను లేవనెత్తి మాట్లాడటంపై నాగబాబు, ప్రకాష్ రాజ్ ఏకంగా తమ అసోసియేషన్ సభ్యత్వానికే రాజీనామా చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yiLQjb
No comments:
Post a Comment