నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. నిన్న (డిసెంబర్ 2) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా 'అఖండ' విడుదల కావడంతో చాలాకాలం తర్వాత థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. తొలి షోతో సూపర్ డూపర్ హిట్ అనే మౌత్ టాక్ రావడంతో సాయంత్రానికల్లా థియేటర్ల వద్ద మాస్ జాతర షురూ అయింది. అన్ని ఏరియాల్లోని సినిమా హాల్స్ కిటకిటలాడాయి. దీంతో తొలిరోజు ఊహించినదానికి మించిన వసూళ్లు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం- 4.39 కోట్లు సీడెడ్- 4.02 కోట్లు ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు వెస్ట్ గోదావరి- 96 లక్షలు గుంటూరు- 1.87 కోట్లు కృష్ణా- 81 లక్షలు నెల్లూరు- 93 లక్షలు ఓవరాల్‌గా చూస్తే అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 54 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగి తొలి షోతోనే కలెక్షన్ల ఊచకోత షురూ చేశారు బాలయ్య బాబు. మరో 35.26 కోట్లు రాబట్టిందంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసినట్లే. మొదటి రోజే ఈ రేంజ్ టాక్ రావడంతో ఈ శని, ఆది వారం ముగిసేసరికి ఈ సినిమా లాభాల బాటలోకి ఎంటర్ అవుతుందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32WZVY7
No comments:
Post a Comment