నందమూరి నటసింహం మరో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకునే దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన '' మూవీ తొలి రోజే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమాతో థియేటర్ల వద్ద మాస్ జాతర షురూ అయింది. నందమూరి అభిమానుల ఈలలు, గోలలతో థియేటర్స్ హోరెత్తిపోతున్నాయి. అటు ప్రేక్షకుల తీరు ఇలా ఉంటే ఇటు సెలబ్రిటీలు ఈ సినిమా చూసి ఫిదా అయిపోతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ పోతినేని 'అఖండ'పై తమ తమ రియాక్షన్స్ ఇచ్చారు. బాలయ్య బాబు నటనను మెచ్చుకుంటూ అఖండ చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. అఖండతో అద్భుతమైన ఆరంభం.. ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇదే బాటలో తాజాగా నందమూరి వారసుడు, యంగ్ టైగర్ యమ క్రేజీగా స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ''అఖండ మూవీని ఇప్పుడే చూశా. ఈ సినిమాతో రీ సౌండింగ్ సక్సెస్ అందుకున్న బాల బాబాయ్‌కి, టీమ్ మొత్తానికి అభినందనలు. సినిమాలో ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి'' అని పేర్కొంటూ నందమూరి అభిమానులను మరింత హూషారెత్తించారు ఎన్టీఆర్. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. జై బాలయ్య, జై ఎన్టీఆర్ అంటూ తమ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ''సింహ, లెజెండ్'' సినిమాల తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ సక్సెస్‌ఫుల్ కాంబోలో హాట్రిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rEHAcq
No comments:
Post a Comment