స్టైలిష్ స్టార్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'పుష్ప'. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో అల్లు అర్జున్ కనిపించనుండగా.. ఆయన ప్రేయసి శ్రీ వల్లి పాత్రలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా రష్మిక నటిస్తోంది. డిసెంబర్ 17న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విశేషాలు పంచుకుంది రష్మిక. అల్లు అర్జున్‌తో తెర పంచుకోవాలని తాను కోరుకున్న కోరిక ఇంత త్వరగా నెరవేరినందుకు చాలా ఆనంద పడుతున్నానని చెప్పిన రష్మిక.. ఈ సినిమాతో నటిగా మరో మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోందని తెలిపింది. షూటింగ్ ప్రారంభమైన తొలి రోజుల్లో సెట్స్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించడం ఒత్తిడిగా అనిపించేదని, ఇదే విషయాన్ని ఓ రోజు బన్నీతో పంచుకుంటే దుటివాళ్ల ప్రతిభ గురించి ఎక్కువ ఆలోచించకు అని చెబుతూ ధైర్యం నూరిపోశారని చెప్పింది. ఈ రోజు నువ్విక్కడ ఉన్నావంటే అది నీ ప్రతిభ వల్లనే అంటూ బన్నీ ఇచ్చిన ప్రోత్సాహంతో తనలో భయం పోయిందని రష్మిక వెల్లడించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న ‘పుష్ప' మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందులో మొదటి భాగమైన ‘పుష్ప ద రైజ్' పేరిట రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంత చేసిన ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని మేకర్స్ అంటున్నారు. ఇకపోతే మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ రోల్ పోషించడం ఈ సినిమాకు మరో ఎసెట్. సునీల్, అనసూయ పాత్రలు కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండనున్నాయట. ఈ మూవీపై బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m3eXlD
No comments:
Post a Comment