Monday 6 December 2021

దటీజ్ ప్రభాస్.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి డార్లింగ్ భారీ విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసేశాయి. అకాల వర్షాన్ని వచ్చిన వరదలతో అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా.. టాలీవుడ్ కదిలింది. ఎన్టీఆర్ , రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా అందరూ రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించారు. తాజాగా మాత్రం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ప్రభాస్ ఇలా బాహుబలి రేంజ్‌లో విరాళాలు ప్రకటించడం కొత్తేమీ కాదు. ఇలా ప్రభుత్వాలకు అవసరమైన సమయంలో తన వంతుగా ఆర్థికంగా అండగా నిలబడుతూనే వస్తున్నాడు. కరోనా సమయంలోనూ నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలబడ్డాడు. ఇక హైద్రాబాద్ వరదల సమయంలోనూ ప్రభాస్ తన మంచి మనసును చాటుకున్నాడు. ఇలా ప్రభాస్ చేసే సాయాలకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోడు. అందుకే డార్లింగ్ మనసు ఎంతో మంచిదని అంటుంటారు. ప్రభాస్ ఎప్పుడూ సాయం చేసినా, విరాళం అందించినా కూడా తన స్థాయికి తగ్గట్టుగానే ఇస్తుంటాడు. ఎంతైనా రాజులు రాజులే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఆది పురుష్ చిత్రానికి కూడా గుమ్మడి కాయ కొట్టేశాడు. సలార్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. వచ్చే ఏడాది మాత్రం స్పిరిట్ షూటింగ్‌ను పట్టాలెక్కించేట్టు కనిపిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ కింగ్‌లా మారిపోయాడు. దాదాపు వంద నుంచి రెండు వందల కోట్ల రెమ్యూనరేషన్‌తో ప్రభాస్ దూసుకుపోతోన్నాడు. ప్రభాస్ చేసే చిత్రాలన్నీ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే ఉండబోతోన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xZlLFM

No comments:

Post a Comment

'We Are Lucky To Have Modi'

'We don't have to go abroad for anything.' from rediff Top Interviews https://ift.tt/lL8j2sy