తనదైన క్యూట్ లుక్స్‌తో అనతికాలంలోనే టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హీరోయిన్ . 'అలా మొదలైంది' సినిమాతో సినీ జర్నీ స్టార్ట్ చేసి తనదైన నటనతో అలరిస్తోంది. పాత్రలు ఎంచుకోవడంలో తనది ప్రత్యేక మార్గం అన్నట్లుగా కెరీర్ కొనసాగిస్తూ హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తోంది నిత్యా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో జరిగిన ప్రభాస్ ఇష్యూపై తన ఆవేదన వెళ్లగక్కింది. నిత్యామీనన్ కెరీర్ ఆరంభంలో ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పిన సందర్భం, ఆమెపై జరిగిన ట్రోలింగ్, అదేవిధంగా చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో తనకు బాగా పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే అంటూ ఓపెన్ అయింది నిత్యా. ''తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు కూడా సరిగా రాదు. తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి కొందరు జర్నలిస్టులు అడిగారు. నాకు తెలియదని చెప్పాను. దాంతో ఆ విషయాన్ని పెద్దది చేసి నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. ఆ సమయంలో జర్నలిస్టులు అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యా. మానసికంగా కుంగిపోయా. అప్పటి ఇప్పటికి నన్ను బాధ పెడుతోంది. ఆ ఇష్యూతో అన్నిచోట్ల నిజాయితీగా ఉండకూడదని అర్థం చేసుకున్నా. అలాగే ఎక్కడ ఎలా ఉండాలో కూడా అర్థమైంది'' అని నిత్యామీనన్ చెప్పింది. దీంతో ప్రభాస్- నిత్యామీనన్ ఇష్యూ మరోసారి వైరల్‌గా మారింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oN2T9Z
No comments:
Post a Comment