Wednesday, 1 September 2021

Chiranjeevi: విజన్ ఉన్న నాయకుడు సీఎం స్టాలిన్‌.. ముఖ్యమంత్రిపై చిరు కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన బుధవారం రోజు మర్యాదపూర్వకంగా స్టాలిన్‌ను మీట్ అయ్యారు. స్థానిక తేనాంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మెగాస్టార్ సీఎంకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించారు. భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి ప్రజా మెప్పు పొందుతున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ భేటీలో స్టాలిన్‌ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి కూడా పాల్గొన్నారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన స్టాలిన్ రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలిస్తూ ప్రజా అభిమానం చూరగొంటున్నారు. ప్రజా సేవకు పెద్దపీట వేసి ముందుకెళ్తూ పలువురి మెప్పు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో మీట్ అయిన చిరంజీవి ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ''కోవిడ్ పరిస్థితిలో కూడా సమర్ధవంతమైన పాలన నిర్వహించి అంకితభావంతో పని చేసిన నాయకులు. ఓ విజన్ ఉన్న ముఖ్యమంత్రి'' అని ట్యాగ్ చేశారు. రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. దీంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' మూవీ చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38zzA1K

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....