నాని- సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ''. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకొని కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10వ తేదీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ భారీ డీల్ కుదుర్చుకుందని విన్నాం. అయితే 'టక్ జగదీష్' థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో వివరణ ఇచ్చిన ఎమోషనల్ అయ్యారు. ఓటీటీలో 'టక్ జగదీష్' రిలీజ్ అవుతుండటం పట్ల వస్తున్న అభ్యంతరాలపై మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్లంటే నాకు చాలా గౌరవం. వాళ్లున్న పరిస్థితుల్లో వాళ్లు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. వారి కష్టాన్ని, పరిస్థితులను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే జగదీష్ నాయుడు (‘టక్ జగదీష్’ లో నాని రోల్), నేనూ వాళ్ల ఫ్యామిలీయే. నేనూ వాళ్లలో ఒకడినే. నన్ను పరాయివాడిగా చూడటం బాధ అనిపించింది. నా సినిమాను ఆపేస్తామని కూడా అన్నారట. నిజంగా బయట క్లిష్టమైన పరిస్థితులు లేనప్పుడు నా సినిమా థియేటర్స్‌లో విడుదల కాకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయాలనుకోవడం కాదు.. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటాను'' అన్నారు నాని. 'టక్ జగదీష్' సినిమాలో కొత్త ట్విస్ట్‌లు, కొత్త విశేషాలు ఉంటాయని అయితే నేను చెప్పను. మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి సినిమాలను అయితే చూస్తూ పెరిగామో, ఇప్పుడు ఎలాంటి సినిమాలను మిస్ అవుతున్నామో అలాంటి సినిమాను ‘టక్ జగదీష్’ రూపంలో చూడబోతున్నాం. మన ఇల్లులాంటి సినిమా ఇది. ఇందులో అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. శివ ఈ కథ చెప్పిన వెంటనే ఇంప్రెస్స్ అయి ఓకే చెప్పానని తెలిపారు నాని.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zHRNGn
No comments:
Post a Comment