Wednesday, 1 September 2021

గుడిలో ఉన్నా సోదరా.. పవన్ బర్త్ డే నాడు బండ్ల గణేష్ లేటు ట్వీట్.. ఫ్యాన్స్ రియాక్షన్స్ మామూలుగా లేవు

ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్‌ని ఆకాశానికెత్తే వ్యక్తి బండ్ల గణేష్.. పవన్ నా దేవుడని చెప్పుకునే బండ్ల గణేష్.. పవన్ వ్యక్తిత్వానికి సాటెవ్వరూ లేరని చెప్పే బండ్లన్న.. పవన్ కోసం ప్రాణాలైనా ఇస్తానని ఓపెన్‌గా చెప్పే బండ్ల గణేష్.. నేడు (సెప్టెంబర్ 2) పుట్టినరోజున ఆలస్యంగా బర్త్ డే విషెస్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. పవన్ పుట్టిన రోజున బండ్లన్న ట్వీట్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. కాకపోతే కాస్త లేట్ చేశారంతే. దీంతో ఈ విషయమై నెటిజన్లు ఆయన్ను ప్రశ్నించగా ఆసక్తికరంగా బదులిచ్చారు బండ్లన్న. అందరూ ఊహించినట్లుగానే నా దేవుడు అని సంబోధిస్తూ పవన్ కళ్యాణ్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు బండ్ల గణేష్. ''మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఐక్యత, బాధ్యత, వాస్తవికత, నాణ్యత, స్వచ్ఛత, పవిత్రత, సమగ్రత, నైతికత ఇలా అన్నీ ఓకే మనిషిలో ఉన్న దేవుడు పవన్ కళ్యాణ్'' అని పేర్కొన్నారు. పవన్ అభిమానులకు బండ్లన్న చేసిన ఈ ట్వీట్ కిక్కిచ్చింది కానీ కాస్త ఆలస్యమైంది అంతే. దీంతో 'ఏంటి ఇంత లేట్ అయింది..గణేష్ గారు' అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కామెంట్స్ చూసిన బండ్ల గణేష్ క్రేజీగా రియాక్ట్ అయ్యారు. 'గుడిలో ఉన్న సోదరా' అంటూ ట్వీట్ పెడుతూ తన ఆలస్యానికి కారణం చెప్పారు. దీనిపై తిరిగి నెటిజన్స్ ఇస్తున్న రియాక్షన్స్ అంతకంటే క్రేజీగా ఉన్నాయి. ''గుడి అన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఇల్లు అన్నమాట, పవన్ ఇంట్లో ఉన్నారా అన్నా.. ఆయన వందేళ్లు బ్రతలాకాలని దేవుడికి కుంకుమ బొట్టు పెట్టండి'' అని కొందరు రియాక్ట్ అవుతుండగా.. ''నాకు తెలిసి గుడిలో పూజారిని కళ్యాణ్ గారి పేరిట అర్చనలు,గోత్ర నామాలు చేయమనికాసేపు అల్లాడించి ఉంటారు అనుకుంటా, మీ దేవర పేరు మీద అర్చన చేయించారా'' ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DHpQ40

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8