Sunday, 4 April 2021

Raj Tarun: చిరంజీవి పేరు చెప్పి అడ్డంగా బుక్కైన చిన్న హీరో.. రంగంలోకి మహేష్ ఫ్యాన్స్! భలే ఆడుకున్నారులే..

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోలందరూ కలిసి బాగానే ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం వర్గాలు చీలి మరి ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. ఒక్కోసారి చిన్న హీరోలు కూడా ఈ ఫ్యాన్స్ దాడికి బలి అవుతుంటారు. ఒకరి పేరు చెబితే మరో హీరో అభిమానులు హర్ట్ అవుతుంటారు. అలా తాజాగా సోషల్ మీడియాలో బుక్కయ్యాడు. రాజ్ తరుణ్ తాజాగా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. ఈ మధ్య సెలెబ్రిటీలందరూ కూడా తమ ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. కొంటె ప్రశ్నలకు కొంటెగాను.. కౌంటర్లకు కౌంటర్లు వేస్తూ సెలెబ్రిటీలు రచ్చ చేస్తున్నారు. తాజాగా రాజ్ తరుణ్ కూడా కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు. కానీ మహేష్ బాబు చిరంజీవి ఫ్యాన్స్ మధ్య ఇరుక్కుపోయాడు. టాలీవుడ్‌లో ఫేవరేట్ యాక్టర్ ఎవరు? అని ఓ నెటిజన్ రాజ్ తరుణ్‌ను అడిగేశాడు. దానికి రాజ్ తరుణ్.. చిరంజీవి అని సమాధానం ఇచ్చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గతంలో రాజ్ తరుణ్ మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పడాన్ని ఓ నెటిజన్ గుర్తు చేశాడు. నువ్ మహేష్ బాబు ఫ్యాన్‌వా? చిరంజీవి ఫ్యాన్‌వా? క్లారిటీ ఇవ్వు అన్నా?.. నేను ఎప్పుడూ మహేష్ బాబు ఫ్యాన్‌నే. కానీ చిరంజీవి గొప్ప ఆర్టిస్ట్ కాదని నువ్ చెప్పగలవా? ఆర్ట్‌ను ఆర్టిస్ట్‌ను ప్రేమించడం నేర్చుకోండి అంటూ కౌంటర్ వేశాడు. అయితే మరో నెటిజన్ నేరుగా నిలదీసేశాడు. ఫేవరేట్ యాక్టర్ అంటే చిరంజీవి అన్నావ్.. అంటే మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పడం అబద్దమా? అని మరో నెటిజన్ అడిగేశాడు. ఇక దీనికి మండిపోయిన రాజ్ తరుణ్.. ఎదుగు బాబాయ్ అని కౌంటర్ వేశాడు. మొత్తానికి ఈ యువ హీరో ఇలా అభిమానుల చేతికి చిక్కి సతమతమయ్యాడు. కానీ రాజ్ తరుణ్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పి అందరినీ ఆకర్షించాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31Ke9Yr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....