ఇటు బుల్లితెర, అటు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తనకు ఆడ బిడ్డ పుట్టిందనే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లి, పాప సురక్షితంగా ఉన్నారని సన్నిహితులు తెలుపుతున్నారు. దీంతో ఆమెకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ సమయంలో హరితేజ గర్భవతి అయ్యారు. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నానంటూ స్వయంగా తన అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఏ మాత్రం మొహమాట పడకుండా తన సోషల్ మీడియాలో ఖాతాల్లో బేబీ బంప్‌తో దిగిన ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉన్నారు. మొదట టెలివిజన్ తెరపై మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం లాంటి పాపులర్ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హరితేజ.. ఆ తర్వాత వెండితెరపై కూడా అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే బిగ్‌బాస్ తొలి సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన హరితేజ ఆ షోకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోలో బిగ్ బాస్ బ్యూటీగా తెగ హంగామా చేస్తూ అల్లరి చేశారు. రీసెంట్‌గా ''అల్లుడు అదుర్స్, జాంబి రెడ్డి'' సినిమాల్లో కనిపించారు హరితేజ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rUy9Cr
No comments:
Post a Comment