Thursday, 22 April 2021

తన కొడుకును చూడగానే చిరంజీవి ఫీలింగ్స్.. వెంటనే మేనేజర్‌ని పిలిచి!! నర్సింగ్ యాదవ్ భార్య ఓపెన్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్ చికిత్స పొందుతూ 2020 డిసెంబర్ 31న మరణించారు. ఆయన ఆకస్మిక మరణం టాలీవుడ్‌లో విషాదం నింపింది. నర్సింగ్ యాదవ్ మరణంతో అందరికంటే ఎక్కువగా బాధపడిన వారిలో మెగాస్టార్ ఒకరు. నర్సింగ్‌తో మెగాస్టార్‌కి ఉన్న అనుబంధం అలాంటిది. అయితే నర్సింగ్ యాదవ్ కొడుకుకు చిరంజీవి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట. ఆ విషయాన్ని నర్సింగ్ భార్య చిత్ర వెల్లడించింది. నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలతో పాటు ఆయన పరిచయాలు ఇలా పలు విషయాలపై రియాక్ట్ అయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో నర్సింగ్ యాదవ్‌కి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ఓపెన్ అయింది. చిరంజీవి ఏ సినిమా షూటింగ్‌ జరుగుతున్నా అక్కడ నర్సింగ్‌ ఉండాల్సిందే అని, మెగాస్టార్ లొకేషన్‌కు రావడానికి ముందే నర్సింగ్‌ అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితులు చక్కబెట్టేవారని చెప్పుకొచ్చింది చిత్ర. పైకి గంబీరంగా కనిపించినా వయసు తగ్గట్లుగానే ఎదుటి మనిషికి గౌరవం ఇచ్చే తత్వం నర్సింగ్ యాదవ్‌ది అని చెప్పిన చిత్ర.. అతనితో మెగా సాన్నిహిత్యం గురించిన కొన్ని విషయాలు వెల్లడించింది. తమకు కొడుకు పుట్టాడని ఒకరోజు చిరంజీవి దగ్గరకు వెళ్లామని, మా అబ్బాయిని చూసి మెగాస్టార్ చాలా సంతోష పడ్డారని చిత్ర చెప్పింది. ఆ ఆనందంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన మేనేజర్‌ని పిలిచి ఖరీదైన గోల్డ్ చెయిన్ తెప్పించి తన కొడుకుకు బహుమతిగా ఇచ్చారని తెలిపింది. దాదాపు 7తులాల బరువున్న ఆ గోల్డ్ చెయిన్‌ను అలాగే బాబు మెడలో వేసినట్లు చిత్ర చెప్పుకొచ్చింది. గతంలో కూడా చిరంజీవి- నర్సింగ్ యాదవ్ అనుబంధం గురించి కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రస్తావించింది చిత్ర.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RPlWSZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....