Saturday, 24 April 2021

సినిమా రౌండప్: క్రికెట్ దిగ్గజం సచిన్‌పై మెగాస్టార్ కామెంట్.. మోహన్ బాబు అలా! నమ్రత సవాల్

సచిన్ గొప్పతనంపై చిరంజీవి పోస్ట్ నిన్న (ఏప్రిల్ 24) క్రికెట్ దిగ్గజం, కోట్లాది క్రీడాభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. బిలియన్ ప్రజల కలలను సాకారం చేస్తూ సత్తా చాటినా.. నిజ జీవితంలో ఎంతో వినయంగా ఉండే మాస్టర్ బ్లాస్టర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు చిరంజీవి. సితారతో మహేష్ కరోనా ఉదృతి కారణంగా సినిమా షూటింగ్స్ పక్కనబెట్టి హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన గారాలపట్టి సితారతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్ బాబు సెకండ్ డోస్ దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు మోహన్ బాబు. తాజాగా ఈ పిక్ షేర్ చేస్తూ ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అదో సవాల్ అంటున్న నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తాజాగా తన జిమ్ ఫొటో షేర్ చేసింది. వ్యాయామం చేయడం అనేది సవాల్‌తో కూడుకున్న పని అని కామెంట్ చేసింది. ఈ కోవిడ్ సమయంలో ఇంట్లో అంతా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండండని పేర్కొంది. శివాత్మిక రివర్స్ గేర్ జీవిత రాజశేఖర్ కుమార్తె శివాత్మిక 'దొరసాని'గా మనందరికీ పరిచయమైంది. కాలంలో కాస్త వెనక్కి వెళ్లి.. సంప్రదాయ దుస్తుల్లో, దొర కుమార్తెగా వెండితెరపై మెరిసింది. అయితే ఇప్పుడు మాత్రం రివర్స్ గేర్ వేసి మోడ్రన్‌ అమ్మాయిగా మారి నెటిజన్లను సర్‌ప్రైజ్‌ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QZouNS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....