నందమూరి నటసింహం హవా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ పూర్తి చేస్తున్న వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న ఆయన.. ఆ తర్వాత క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు టాక్ బయటకొచ్చింది. మరోసారి థియేటర్ల గేట్లకు తాళాలు రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేది వరకూ సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. వకీల్‌సాబ్ ఆడుతున్న సినిమా హాళ్లు మినహా అన్ని థియేటర్లు బుధవారం నుంచి మూతపడనున్నాయని వెల్లడించారు. డైరెక్టర్ సుధీర్ బాబు అదేంటి సుధీర్ బాబు హీరో కదా! అనుకుంటున్నారా.. నిజమే కానీ ఆయన లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో సుధీర్ డైరెక్టర్‌గా నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. భయపెట్టేందుకు రెడీ అవుతున్న శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ వెండితెరపై కూడా రాణిస్తోంది. ప్రస్తుతం హారర్ నేపథ్యంలో ఓ చారిత్రక కథాంశంతో రూపొందుతున్న సినిమాలో ఆమె నటిస్తోంది. తమిళ దర్శకుడు ఆర్. యువన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాణిగా సన్నీ కనిపించనుంది. పంజాబీ హీరోతో పాయల్ తొలి సినిమా Rx100తో కుర్రకారుకు కిక్కిచ్చిన బ్యూటీ ఓ పంజాబీ సినిమాను ఓకే చేసింది. పంజాబీ హీరో గిప్పి గ్రేవాల్ సరసన ఆమె నటిస్తోంది. నిన్న (మంగళవారం) ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xef6Xq
No comments:
Post a Comment