Sunday, 4 April 2021

65వ ఏట జయప్రద ప్రేమాయణం.. సీనియర్ హీరోతో ఆమె! వైరల్ అవుతున్న లేటెస్ట్ అప్‌డేట్

అందం, అభినయం, నాట్యం అన్ని కలగలిపిన అందాల నటి జయప్రద. సాంప్రదాయ పాత్రలైనా.. గ్లామరస్ రోల్ అయినా.. అద్భుతంగా నటించడంలో సిద్ధహస్తురాలు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకున్నారు. రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు చాలాకాలం దూరంగా ఉన్నారు జయప్రద. అయితే ఇప్పుడు ఆమె తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ‘లవ్@65’ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఆవిడ నటిస్తున్నారు. ఇందులో ఆమె సరసన నటకిరీటి హీరోగా నటిస్తున్నారు. 60 సంవత్సరాలు పైబడిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే అంశం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే జయప్రద పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఆమె పయనం ఓ సువర్ణ లిఖిత చరితం.. మళ్లీ మన కోసం రాబోతుంది ఆ నటనా సౌరభం’ అంటూ జయప్రద సూపర్ హిట్ సినిమాల్లోని ప్రధాన సన్నివేశాలతో కూడిన వీడియోని విడుదల చేశారు. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3miRjk1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....