ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడు, హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యారు. రీసెర్చ్ సైంటిస్ట్ దీపికా రాజును శనివారం ఉదయం అశ్విన్ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్‌లోని ఎం.ఎస్.రాజు ఫామ్ హౌస్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సుమంత్, దీపిక వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి కూడా పాల్గొన్నారు. సుమంత్ అశ్విన్ భుజాలపై తలవాల్చి తేజస్వి తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమంత్, తేజస్వి కలిసి ‘కేరింత’ సినిమాలో నటించారు. కాగా, సుమంత్-దీపికలది ప్రేమ వివాహం. దీపికతో తన ప్రేమ గురించి ఇటీవల హైదరాబాద్ టైమ్స్‌తో పంచుకున్నారు సుమంత్. దీపికను గతేడాది మొదటిసారి తన కజిన్ పెళ్లిలో చూశానని సుమంత్ చెప్పారు. దీపిక కవల సోదరిని సుమంత్ కజిన్ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో దీపికను చూసినప్పుడే సుమంత్ ఆమె ప్రేమలో పడిపోయారట. ఆ తరవాత సంక్రాంతికి సుమంత్‌ను దీపిక ఇంటికి ఆహ్వానించారట. దీపిక ఫ్యామిలీతో సుమంత్ సరదాగా గడిపారట. దీపికను పెళ్లిచేసుకోవాలని అప్పడే సుమంత్ డిసైడ్ అయిపోయారట. సుమంత్, దీపికల ప్రేమను వారి పెద్దలు కూడా అంగీకరించడంతో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. దీపిక భార్యగా దొరకడం తన అదృష్టమని సుమంత్ అంటున్నారు. కాగా, సుమంత్ అశ్విన్ 2012లో వచ్చిన ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు సుమంత్ తండ్రి ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించారు. అయితే, ‘కేరింత’ సినిమాతో సుమంత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కానీ, ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్‌తో సుమంత్ మరింత దూసుకెళ్లలేకపోయారు. ఆయన గత చిత్రాలు ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘ప్రేమకథా చిత్రం 2’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఆయన నటించిన ‘ఇదే మా కథ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సుమంత్‌తో పాటు శ్రీకాంత్, భూమిక ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు, దీపిక బయో టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. డల్లాస్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక ఇండియాలోనే స్థిరపడనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/379Bbeg
No comments:
Post a Comment