హీరోకి కథ రాయడం వేరు.. కథ రాసి హీరోని చేయడం వేరు. ఒక హీరోని అనుకుని అతనికి కథ రాస్తే.. అందులో అతడే హీరో. కానీ కథ రాసేసి హీరో కోసం అన్వేషిస్తే మాత్రం ఆ సినిమాలో కథే హీరో. వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రంలో కూడా కథే హీరో. మరి ఇలాంటి కథకు హీరోగా మొదట ఎవర్ని అనుకున్నారు.. వైష్ణవ్ తేజ్ ఎలా వచ్చాడు.. తన గురువు సుకుమార్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉంది..? చిరంజీవి గారికి కథ చెప్పడానికి దర్శకుడు బుచ్చిబాబు సనా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నది ఆయన మాటల్లోనే.. కథ రాసినతరువాత హీరో దొరకలేదు.. ఇది అమ్మాయిల వైపు నుంచి రాసిన మంచి లవ్ స్టోరీ ఇది.. నాకు తెలిసి అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఒక అమ్మాయి ఇంతలా ప్రేమిస్తుందా? అని సినిమా డిస్కషన్స్‌లో వైష్ణవ్ నేను మాట్లాడుకున్నాం. అతను కథను నమ్మాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌నే హీరో అని ఎందుకు అనుకున్నానంటే.. ఈ కథ కంప్లీట్ అయిన తరువాత నాకు హీరోలు ఎవరూ కనిపించడం లేదు.. విజయ్ దేవరకొండ రేంజ్ వేరు.. అందుకే వైష్ణవ్ తేజ్ వచ్చాడు ఫస్ట్ విజయ్ దేవరకొండ అనుకున్నా.. కానీ ఆయన అర్జున్ రెడ్డి చేసిన తరువాత అతని రేంజ్ మారిపోయింది. దీంతో అతను ఈ కథకు అందడు. అలాంటి కుర్రాడు కావాలని వెతుకుతుండగా.. ఇన్ స్టాగ్రామ్‌లో వైష్ణవ్ తేజ్‌ని చూశా. వెంటనే సుకుమార్ సార్ దగ్గరకు వెళ్లి.. సార్ మీరు ఏం చేస్తారో తెలియదు.. నాకు వైష్ణవ్ కావాలని చెప్పాను. సుకుమార్ గారి సలహా.. వైష్ణవ్‌తో దూరం నుంచి పెళ్లి చూపులు దీంతో సుకుమార్ గారు.. చిరంజీవి గారి ఫ్యామిలీ హీరోనా అంటూనే.. కథలో బీభత్సమైన మ్యాటర్ ఉంది అని ఆ ఫ్యామిలీతో సంప్రదింపులు జరుపుదాం. వాళ్లు రిజెక్ట్ చేస్తే నో ప్రాబ్లమ్ కానీ.. కథ చెప్పిన తరువాత మనం వైష్ణవ్‌ని రిజెక్ట్ చేయకూడదు. నువ్ ఒక పనిచేయి.. రంగస్థలం ఎడిటింగ్‌కి వైష్ణవ్ వస్తున్నాడుగా.. నువ్ అతన్ని అబ్జర్వ్ చేయి నీ కథకు పనికి వస్తాడా లేదా? అని సుకుమార్ సార్ చెప్పారు. అలా దూరం నుంచి పెళ్లి చూపులు మాదిరిగా వైష్ణవ్‌ని గమనిస్తూ ఉండేవాడిని. కథ నాకు ఓకే.. చిరంజీవి మామకు నెరేట్ చేయాల్సిందే కొన్నాళ్లు వైష్ణవ్‌ని అబ్జర్వ్ చేసిన తరువాత నా కథకు ఇతనే హీరో అని ఫిక్స్ అయ్యా.. వెంటనే వైష్ణవ్ వచ్చాడు.. కథ చెప్పాను.. అతనికి బాగా నచ్చేసింది. చిరంజీవి మామకి నెరేషన్ ఎప్పుడు చెప్తారని అడిగారు. ఓర్నాయనో.. ఇలాంటి టెన్షన్‌లు ఇప్పుడు పెట్టకు.. నీకు నచ్చింది కదా చేసేద్దాం అని అంటే.. లేదు లేదు.. నా ఫస్ట్ మూవీ పెద్ద మామ చేతుల మీదుగా వెళ్లాల్సిందే.. తరువాత సినిమాలకు అంత పట్టింపు లేదు కానీ ఈ సినిమా కథ మాత్రం చిరంజీవి గారికి చెప్పాల్సిందే అని పట్టుపట్టాడు. చిరంజీవి గారికి కథ చెప్పడం అంటే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్టే నాకు.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవిగారికి కథ చెప్పడానికి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్టు స్టోరీ నెరేషన్ కోసం ప్రిపేర్ అయ్యా. నా డైలాగ్స్ నేనే విన్నా.. ఒక వారం మొత్తం పిచ్చోడిలా మారిపోయా. మొత్తానికి చిరంజీవి గారు కథ వినడం.. ఆయనకు బాగా నచ్చడంతో ఈ కథ సెట్స్ మీదికి వెళ్లింది’ అంటూ చెప్పుకొచ్చారు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZfMD40
No comments:
Post a Comment