Sunday, 21 February 2021

నీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌కి దండం దొర.. హాట్ టాపిక్‌గా మారిన ప్రభాస్ లేటెస్ట్ లుక్స్

'ఈశ్వర్' సినిమాతో సినీ గడపతొక్కి పలు హిట్ సినిమాల్లో నటిస్తూ 'బాహుబలి' సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ . సినిమా సినిమాకు లుక్ మార్చేస్తూ క్యారెక్టర్‌కి అనుగుణంగా మారడంలో 'డార్లింగ్' రూటే సపరేటు. అయితే 'సాహో' మూవీ తర్వాత వరుస సినిమాలకు కమిటైన ప్రభాస్.. నెలల వ్యవధిలోనే డిఫరెంట్ లుక్స్ లోకి ట్రాన్స్‌ఫామ్ అవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'రాధేశ్యామ్' షూటింగ్ కంప్లీట్ చేసిన రెబల్ స్టార్.. ప్రెజెంట్ ''సలార్, ఆదిపురుష్'' సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్యారలల్‌గా ఈ రెండు సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న ఆయన, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ప్రభాస్ క్రేజీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయి నెట్టింట తెగ హంగామా చేస్తోంది. తాజాగా బయటకొచ్చిన ఈ లుక్‌లో యమ స్మార్ట్‌గా కోర మీసాలతో కనిపిస్తున్నారు ప్రభాస్. స్టైలిష్ కళ్ళజోడు పెట్టుకొని అభిమానులను యమ ఆకర్షిస్తున్నారు. అయితే లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' లోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ ఇలా మీసకట్టు లుక్‌కి మారాడని చెప్పుకుంటున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ఆయన రీసెంట్ లుక్స్ పోస్ట్ చేస్తూ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ''నీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌కి దండం దొర, ఒప్పేసుకున్నాం బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌లో నీ తర్వాతే ఎవరైనా, క్యూట్ లుక్స్ డార్లింగ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ప్రభాస్ లుక్స్‌తో మోతమోగిపోతున్నాయి. ఇకపోతే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' చిత్రం జూలై 30న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కళ్ళలో వత్తులు వేసుకొని ఆ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kaWO3e

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...