
కొన్నేళ్లుగా సరైన హిట్ పడక తహతహలాడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్.. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో జత కట్టారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న విలక్షణ కథాంశం 'సీటీమార్'. కబడ్డీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందిస్తున్నారు. కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరోవైపు హీరో గోపిచంద్ కూడా ఎలాగైన బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేయబడిన ఈ టీజర్ ఒక నిమిషం 12 సెకనుల నిడివితో ఆకట్టుకుంది. 'కబడ్డి.. కబడ్డి.. కబడ్డి.. అండ్ యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ' అని విలన్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ స్టార్ట్ చేసి ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలు చూపించారు. కబడ్డీ మైదానాలు, కోచ్‌లుగా తమన్నా, గోపీచంద్ లుక్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. 'కబడ్డీ, మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట' అని గోపీచంద్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్ అవుతోంది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ఫైట్ సీన్స్ ఔరా అనిపించాయి. మొత్తానికైతే తాజాగా విదూడలైన ఈ టీజర్ సినిమా ప్రమోషన్స్‌కి ప్లస్ అనే చెప్పుకోవాలి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ 'సీటీమార్' మూవీ రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. చిత్రంలో గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేసింది. రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZAEOGb
No comments:
Post a Comment