Monday, 1 February 2021

చిరంజీవిపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఆచార్య కథ ఇదేనంటూ రచ్చ! ఎన్టీఆర్‌ని కూడా లాగేసింది బాబోయ్..

శ్రీ రెడ్డి.. ఈ పేరు వింటేనే సంచలనాలు, బోల్డ్ కామెంట్స్, డర్టీ ఫొటోలు ఇలా ఎన్నెన్నో గుర్తొస్తుంటాయి. సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక దోపిడీ జరుగుతోందంటూ కాస్టింగ్ కౌచ్ పేరుతో ఉద్యమాన్ని లేవనెత్తిన హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధ నగ్న ప్రదర్శనతో నిరసన తెలిపి దేశవ్యాప్త పాపులారిటీ సంపాదించింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీతో వైరం పెట్టుకున్న ఈ సంచలన తార అప్పటినుంచి వీలుచిక్కినప్పుడల్లా మెగా హీరోలపై ఎటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా '' టీజర్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏకంగా మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న 'ఆచార్య' కథ తనకు తెలుసంటూ స్టోరీ లైన్ చెప్పేసింది శ్రీ రెడ్డి. ''చిరంజీవి ఎక్కడి నుండో ఒక ఊరికి వస్తాడు, ఆ ఊర్లో వాళ్ళకి దేవుడిలా వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. అంతే'' అంటే అని పేర్కొంటూ ఆచార్య టీజర్ జత చేసింది. అంతటితో ఆగక ఈ ఆచార్య టీజర్ గురించి తన రివ్యూ చెబుతూ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా లాగేసింది. ''అబ్బే, ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోదు. ఆచార్య ట్రైలర్‌లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు'' అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. ఇక దీనిపై నెటిజన్ల స్పందన, కామెంట్లు అంటారా.. అయ్య బాబోయ్! సోషల్ మీడియాలో పెద్ద రచ్చే క్రియేట్ అయిందిలెండి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీ రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా నిత్యం పలు అంశాలపై స్పందిస్తూ అప్పుడప్పుడూ బూతుపురాణాలు వినిపిస్తోంది. సెక్సీ ఫొటోలు, వీడియోలతో రచ్చరచ్చ చేస్తూ ఎలాగోలా అందరి దృష్టి తనవైపు మరల్చుకుంటోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే అమ్మడికి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువండోయ్. ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే.. చిరంజీవి 152వ సినిమాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉంటూనే 'సిద్ధ' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్, అదేనండీ శ్రీ రెడ్డి కామెంట్ చేసిన ఆ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MPIukk

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr