యంగ్ రెబల్ స్టార్ స్పీడు పెంచారు. 2021 ఆరంభం నుంచే తన దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే కమిటైన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్' మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ప్రభాస్. ఇప్పటికే 'సలార్' సెట్స్ మీదకొచ్చేసిన యంగ్ రెబల్ స్టార్.. తాజాగా ఆయన నటించబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ ప్రారంభించేశారు. ఈ మేరకు 'ఆదిపురుష్' ఆరంభ్ అంటూ తన అభిమానులకు ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనుంది 'ఆదిపురుష్' మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ 'ఆదిపురుష్' రూపంలో చూపించనున్నారట. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటం ఆయన అభిమానుల్లో సరికొత్త ఆతృతను నింపేసింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' ఆరంభ్ అంటూ చిత్రయూనిట్ నుంచి వచ్చిన ప్రకటన రెబల్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపింది. తాజాగా ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో తలపడబోయే స్టార్ సైఫ్ అలీఖాన్. ఆయన రావణుడిగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై రెబల్ స్టార్ అభిమానులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rcxo7F
No comments:
Post a Comment