Friday, 1 May 2020

సినిమాలో జరిగిందే నా జీవితంలోనూ జరిగింది.. నాకీ గతి పట్టడానికి కారణం అదే: షకీలా ఆవేదన

జీవితానికి డబ్బుంటే చాలు నువ్వే రాజు, నువ్వే మంత్రి అంటుంటారు కొందరు. కాదు కాదు జీవితంలో సొంత కుటుంబం, బంధువులు, స్నేహితుల ప్రేమను పొందామంటే అంతకన్నా ఐశ్వర్యం లేదంటారు ఇంకొందరు. అయితే తన జీవితంలో మాత్రం ఈ రెండింటినీ కోల్పోయానని చెబుతోంది సెక్సీ బ్యూటీ . డబ్బు విషయంలో తాను నమ్మిన వాళ్ళే నట్టేట ముంచేశారని ఆవేదన చెందుతోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో తన జీవిత పోరాటం, వ్యక్తిగత విషయాలు చెబుతూ బాధ పడింది షకీలా. శృంగార తారగా చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన షకీలా ఒకానొక సమయంలో రసిక ప్రియుల ఆరాధ్యదైవంగా వెండితెరపై హంగామా చేసింది. సౌత్ ఇండియన్ భాషల్లో మసాలా సినిమాల్లో నటించి సెక్సీ తారగా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించింది. ఆ రోజుల్లో కొన్ని థియేటర్స్ ఆమె సినిమాల కోసమే ప్రత్యేకంగా కేటాయించబడేవి. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలు సైతం షకీలా మూవీ రిలీజ్ ఉందంటే తమ సినిమాలు కూడా వాయిదా వేసుకునేవారు. అలాంటి ఆ తార నిజ జీవితం మాత్రం అంతా గాయాలమయమే అని ఆమె మాటలు వింటుంటే స్పష్టమవుతోంది. తెరమీద వెలుగొందినప్పటికీ తన నిజ జీవితంలో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయని షకీలా అంటోంది. కేవలం కుటుంబాన్ని పోషించడం కోసమే తాను అలాంటి పాత్రలు చేశానని, కానీ నమ్మిన సొంత అక్కనే తనను మోసం చేసిందని చెబుతూ తీవ్ర ఆవేదన చెందింది షకీలా. తాను సినిమాలు చేస్తూ పోతుంటే డబ్బు వ్యవహారమంతా అక్కే చూసుకునేదని, అయితే చివరకు ఆ డబ్బంతా నొక్కేసి సొంత అక్కే మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒకతన్ని నమ్మి డబ్బిస్తే అతను పారిపోయాడు నన్నేం చేయమంటావని అక్క అనడంతో షాకయ్యానని షకీలా చెప్పింది. సొంత అక్క కదా అని ఏమీ చేయలేక పోయానని తెలిపింది. ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని, అందరినీ నమ్మడం వల్లనే నాకీ గతి పట్టిందని ఆమె కన్నీరు పెట్టుకుంది. తాను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి తీసి ఖర్చుపెట్టిన సందర్భం కూడా లేదని, అలా చేసి ఉన్నా కొంత సంతోషపడే దాన్నని తన విషాద గాధను వెల్లడించింది షకీలా. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aXkzWr

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8