Sunday, 31 May 2020

సర్కారు వారి పాట.. రికార్డుల వేట: పండగ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న ఆయన ఇప్పుడు ''తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అధికారికంగా టైటిల్ ప్రకటించింది చిత్రయూనిట్. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి 24 గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ఎక్కువ రీ ట్వీట్స్ చేయబడిన ప్రీ లుక్ పోస్టర్‌గా, అలాగే ఎక్కువ లైక్స్ సంపాదించిన ప్రీ లుక్ పోస్టర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఎక్కువ మంది నెటిజన్స్ ఉపయోగించిన టైటిల్ ట్యాగ్ పరంగాను సత్తా చాటుతూ రికార్డుల 'వేలం పాట' మొదలైందని గంట కొట్టి చాటి చెప్పింది. ఇది చూసి సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం చిగురించింది. పండగ చేసుకుంటూ సూపర్ స్టార్ సత్తా అంటే ఇదీ మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: 'సర్కారు వారి పాట' ప్రీ లుక్ పోస్టర్, ఈ హవా చూస్తుంటే మరో భారీ బ్లాక్ బస్టర్ సినిమా మహేష్ సొంతం కాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TY2K3N

సోషల్ మీడియాలో సినీ నటి ప్రగతి హల్ చల్.. నడుమును తిప్పుతూ..

సినీ నటి ప్రగతి.. ప్రత్యేక పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా, పిన్నిగా, వదినగా, అత్తగా ఇలా అనేక రకాల పాత్రల్లో తనదైన స్టైల్లో నటించి అభిమానుల్ని మెప్పించింది. ఏ క్యారెక్టర్ ఇచ్చిన అందులో ఒదిగిపోతుంది. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాక్ డైన్‌తో ఇంటికే పరిమితమైన ప్రగతి ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టింది. రోజుకు రకరకాల వర్క్ అవుట్స్ చేస్తోంది. తాజాగా ప్రగతి చేసిన ఇనస్టా పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రగతి ఆ మధ్య విజయ్ మాస్టర్ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా కూడా మారింది. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది ప్రగతి. మ్యూజిక్‌కి తగ్గట్టు తన నడుముని తిప్పుతూ యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. బీట్‌కు తగ్గట్టు నడుము తిప్పుతూ.. తనకెంత ఫిట్ నెస్ ఉందో బయటపెట్టింది. ప్రగతి వయసు 44 ఏళ్ళు. అయినా సరే యువ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూకుడుతో ముందుకెళ్తోంది ఈ ఆంటీ. ప్రగతి బాడీలో ఇంత రిథమ్ చూసి ఫాలోవర్స్ సైతం షాక్ అవుతున్నారు. అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా తన హోమ్లీ అందంతో అందర్నీ ఆకర్షిస్తోంది. వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ప్రగతి ఎక్కువగా ఇష్టపడుతుందని తెలుస్తోంది. కెరీర్ మొదటి నుంచి ఏ పాత్ర చేసిన ఇష్టంతోనే చేస్తానని ఆ పాత్రలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తానని చెబుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eD9T1e

అఫీషియల్: కరణం మల్లీశ్వరి బయోపిక్ అనౌన్స్.. మరో పాన్ ఇండియా మూవీ!

ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని, సాధించిన విజయాలను వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే బయోపిక్స్ రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ అనౌన్స్ చేశారు కోన వెంకట్. ఈ రోజు (జూన్ 1) క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. Also Read: అయితే ఈ చిత్రంలో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకుంటారా? లేక బాలీవుడ్ భామను ఫైనల్ చేస్తారా? అనే దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అతిత్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cmngl9

RedmiBook 13 Tipped to Launch in India on June 11

RedmiBook 13 Ryzen Edition, RedmiBook 14 Ryzen Edition, and RedmiBook 16 Ryzen Edition recently made their debut in China. Now, it seems RedmiBook 13 may soon make its India debut. India will,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2zQRuPL

Google Stands in Support of Racial Equality: Sundar Pichai

Google stands in support of racial equality and all those who search for it, Indian-American CEO of the technology giant Sunder Pichai said on Sunday.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZVq3iD

SpaceX Crew Dragon Delivers Two Astronauts to International Space Station

Nearly 24 hours after launching from Florida, SpaceX's Crew Dragon capsule delivered NASA astronauts Bob Behnken and Doug Hurley to the International Space Station on Sunday, marking the first US...

from NDTV Gadgets - Latest https://ift.tt/2AvYt0o

Amazon Removes Racist Messages After They Appear on Some Product Listings

Amazon.com said it was removing certain images after messages using extremely strong racist abuse appeared on some listings on its UK website when users searched for Apple's AirPods and other similar...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dkgltO

How this town persuaded migrant workers to stay

'It is because we treat them as our own people, and there is no difference between owners and workers here.'

from rediff Top Interviews https://ift.tt/2XkD2IL

పూరి కథ కోసం ఎదురుచూస్తున్నా.. మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మహేష్ బాబు- క్రేజీ కాంబోలో సినిమా రావాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ''పోకిరి, బిజినెస్‌మేన్'' సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో మళ్ళీ ఇప్పుడు అందరి చూపు ఈ కాంబోపై పడింది. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందేమో అనిపిస్తోంది. నిన్న విడుదలైన మహేష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ 'సర్కార్ వారి పాట' చూసి పూరి జగన్నాథ్ అభినందించడం, మరోవైపు కాసేపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన .. పూరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్‌స్టా వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు మహేష్ బాబు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? దానికోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని అడగగా మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్తానని, తనకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరని, ఆయన కథ నేరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని చెప్పారు. దీంతో పూరి- మహేష్ కాంబోకి త్వరలోనే ముహూర్తం పెట్టడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. Also Read: ఇకపోతే ఈ ఏడాది ఆరంభం లోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన మహేష్ బాబు.. ఇప్పుడు 'సర్కార్ వారి పాట' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. సో.. చూడాలి మరి ఇంతటి బిజీ షెడ్యూల్‌లో పూరి జగన్నాథ్ తన కథతో మహేష్ డేట్స్ పట్టేస్తాడా? లేదా? అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36OMyHt

అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదు: ఆసక్తికర విషయాలు చెప్పిన ఆలీ

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన స్నేహితుడు, జనసేన అధినేత పవర్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆదివారం ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన ఆలీ.. పవన్ కళ్యాణ్‌తో తన పరిచయం గురించి, ఆయనతో ఏర్పడిన బంధం గురించి చెప్పుకొచ్చారు. తాను చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేవారని.. ఆయనతో అలా పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదని అన్నారు. ‘‘నేను అన్నయ్య కోసం వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేవారు. ఆయన్ను కలిసేవాడిని. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోకి ఎంటర్ కాలేదు. ‘అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. మీరు కూర్చోండి.. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. అన్నీ సినిమా కబుర్లే. ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగేవారు. ఆ తరవాత ఆయన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ ఒక్క సినిమా తప్ప ఆ తరవాత ఇంచుమించుగా అన్ని సినిమాల్లో నేను నటించాను. Also Read: ఇటీవల ‘అజ్ఞాతవాసి’లో కూడా నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. మొదట ‘గోకులంలో సీత’, తరవాత ‘సుస్వాగతం’, తరవాత ‘తొలిప్రేమ’ సినిమాలో నటించాను. ‘తొలిప్రేమ’ సినిమా నుంచి మా జర్నీ బలపడింది. పవన్ కళ్యాణ్ గారితో ఆఖరిగా చేసిన సినిమా కాటమరాయుడు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు. బయట కార్యక్రమాల్లో ఆలీ ఎదురుగా కనబడినా, ఆయన మాట్లాడినా పవన్ కళ్యాణ్ నవ్వడం మొదలుపెడతారు. దీని గురించి ఆలీ మాట్లాడారు. ‘‘మేం కొన్ని సైగలు చేసుకుంటూ ఉంటాం. అవి మా ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలీవు. నావి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే, బ్రహ్మానందం గారన్నా ఆయనకు చాలా ఇష్టం. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందం గారు చాలా దగ్గర. మెగా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆహ్వానించే కొంత మంది పేర్లలో బ్రహ్మానందం గారి పేరు, నా పేరు కచ్చితంగా ఉంటాయి’’ అని ఆలీ వెల్లడించారు. Also Read: ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి నుంచి తనకు ఆవకాయ పచ్చడి వస్తుందని ఆలీ తెలిపారు. పెద్ద జాడీతో ఆవకాయ పచ్చడి పంపుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా సేంద్రియ మామిడి పండ్లు పంపేవారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మామిడి పండ్లు రాలేదని.. బహుశా వచ్చే ఏడాది రావచ్చేమోనని ఆలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వైఎస్సార్‌సీపీలో చేరిన తరవాత తన రాజకీయాల గురించి ఆలీ మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల నుంచి మా ఇంట్లో పాలిటిక్స్‌తో సరిపోతోంది. పిల్లలకి నాకు.. నాకు, మా ఆవిడకి రాజకీయాలు జరుగుతున్నాయి. కోవిడ్ అయిన తరవాత వెళ్లి కలుస్తా’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36MHmUg

గౌతమ్ కాబోయే హీరో.. రాజమౌళితో కచ్చితంగా సినిమా చేస్తా: మహేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు

తన తండ్రి నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (మే 31న) తన కొత్త సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మహేష్. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ టైటిల్ పోస్టర్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, ఆదివారం సాయంత్రం మహేష్ బాబు తన అభిమానులను మరోసారి ఫిదా చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సుమారు గంటపాటు ఈ ఛాట్ ప్రోగ్రాం సాగింది. అభిమానులు చాలా ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటికి అంతే ఆసక్తికరంగా మహేష్ బాబు సమాధానాలు చెప్పారు. గౌతమ్ హీరో అవుతాడా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘అతను కోరుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. కాలమే చెబుతుంది’’ అని సమాధానం ఇచ్చారు. Also Read: అలానే, ‘‘రాజమౌళితో మీరు సినిమా చేస్తారని మేం ఆశించొచ్చా?’’ అని ఒక అభిమాని మహేష్‌ను అడిగారు. దీనికి మహేష్ అవుననే సమాధానం ఇచ్చారు. ‘‘అవును, కచ్చితంగా మీరు ఆశించొచ్చు. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లలో నేనూ ఒకడిని’’ అని మహేష్ రిప్లై ఇచ్చారు. అంటే, RRR తరవాత రాజమౌళి పనిచేయబోయేది మహేష్‌తోనేనని ఒక స్పష్టత వచ్చింది. మహేష్ చెప్పిన మరికొన్ని సమాధానాల్లో ఆసక్తికరమైనవి మీకోసం.. ✪ లాక్‌డౌన్ తరవాత లైఫ్ ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు? లాక్‌డౌన్ తరవాత జీవితం కచ్చితంగా వేరేగా ఉంటుంది. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఈ కొత్త పరిస్థితిని మనందరం పాటించాలి. కాబట్టి, అందరూ సురక్షితంగా ఉండండి. ✪ మీకు ఇష్టమైన జంక్ ఫుడ్ ఏంటి సార్? బర్గర్లు, పిజ్జాలు ✪ మీ పెంపుడు శునకాల పేర్లేమిటి? నొబిటా, ప్లూటో ✪ మీ గురించి ఒక సీక్రెట్ చెప్పండి? ఇదొక రహస్యం. మీకు నేను ఎలా చెబుతాను. ✪ మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి.. అలాగే నా ఆల్‌టైమ్ ఫేవరేట్ సచిన్ టెండూల్కర్. ✪ మీ నిక్ నేమ్ ఏంటి సార్? నాని ✪ ఖాళీ సమయంలో మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు? పుస్తకాలు చదువుతాను. బోలెడన్ని సినిమాలు చూస్తాను. ఈతకొడతాను. నా పిల్లలతో ఆడుకుంటాను. అలాగే, నా శునకాలతో ఆడుకుంటాను. నా చేతిలో చాలా అంశాలు ఉన్నాయి. ✪ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నమ్రతా శిరోద్కర్ ✪ మీ కొత్త సినిమా థీమ్ ఏంటి సార్? ‘సర్కారు వారి పాట’ ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. అలాగే, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చేయడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ✪ సితార, గౌతమ్.. వీరిద్దరిలో ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు? వారిద్దరూ నాలో భాగం. వారిలో ఒకరిని తక్కువగా ఎలా ప్రేమించగలను? ✪ టీ, కాఫీల్లో మీకు ఏది ఇష్టం? నేను కాఫీ పర్సన్‌ని. ✪ మీకు ఎంతో ఇష్టమైన మునగకాయ మటన్ వంటకం గురించి ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు గుర్తుచేయొద్దు.. ✪ మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా? నాకు 26 ఏళ్ల వయసులో ఉండేది. అప్పుడే నమ్రతను పెళ్లిచేసుకున్నాను. ✪ వర్షం పడుతోంది, వాతావరణం చాలా బాగుంది. ఇలాంటప్పుడు మీకు ఏ స్నాక్ తినాలనిపిస్తుంది? అల్లం టీతో మిర్చి బజ్జీ ✪ పూరీ గారితో భవిష్యత్తులో ఒక సినిమా చేస్తారా? వెయిటింగ్ సార్ కచ్చితంగా చేస్తాను. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన నా దగ్గరకు వచ్చి ఒక కథ చెబుతారని ఇప్పటికీ వేచి చూస్తున్నాను. ✪ టీ20, టెస్ట్ క్రికెట్.. ఈ రెండు ఫార్మాట్లలో ఏదంటే మీకు ఇష్టం? టెస్ట్!! ఈ విషయంలో రెండు అభిప్రాయాలు లేవు. ✪ మీ గురించి ఏం గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు? నేనొక గొప్ప నటుడిగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే, నా పిల్లలకు అద్భుతమైన తండ్రిగా, నా భార్యకు మంచి భర్తగా గుర్తిండిపోవాలి. ✪ హాయ్ సార్.. నా పేరు మణి.. మిమ్మల్ని ఒక జేమ్స్ బాండ్ మూవీలో చూడాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మేం ఆశించొచ్చా? మణి.. మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే నాకు పంపించండి. నాకు ఇలాంటి ఒక సినిమా చేయాలని ఉంది. ✪ సమంత, రష్మికల్లో మీరు ఎవరిని ఇష్టపడతారు? వాళ్లిద్దరూ నాకు ఎంతో ఇష్టం. వాళ్లు అద్భుతమైన సహనటులు. ✪ మీ పిల్లల కోసం మీరు వండగలిగే మంచి వంటకం ఏంటి? మ్యాగీ నూడిల్స్ ✪ మీ ఫేవరేట్ గేమ్ ఏంటి సార్? నా కొడుకుతో ఆన్‌లైన్‌లో టెన్నిస్, గోల్ఫ్, బేస్‌బాల్ ఆడటం అంటే ఇష్టం. ✪ మీకు ఇష్టమైన రంగు, ఆహారం ఏంటి? నాకు ఇష్టమైన రంగు నీలం. నాకు సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZXhL9N

హైదరాబాద్‌లో వర్షం.. ఫాం హౌస్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ప్రకాష్ రాజ్

హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన నగర ప్రజలకు కాస్త ఉపసమనం లభించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ఏర్పడినప్పటి నుంచీ తన ఫ్యామిలీతో హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లో ఉంటున్నారు. ఎంతో మంది వలస కూలీలకు తన ఫాం హౌస్‌లోనే ఆశ్రయం ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సాయంతో వలస కూలీలందరినీ వారి స్వస్థలాలకు పంపారు. ఇక అప్పటి నుంచీ తన భార్య పోనీ ప్రకాష్, కుమారుడు వేదాంత్‌తో ఫామ్ హౌస్‌లో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. Also Read: ఫాం హౌస్‌లో తమ సంతోష గడియలకు సంబంధించి ప్రకాష్ రాజ్ భార్య పోనీ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెడుతూనే ఉన్నారు. ఫాం హౌస్‌లోకి నెమళ్లు రావడం, తమ కుమారుడు వేదాంత్ మామిడి కాయల వ్యాన్ ఎక్కడం, తాను మట్టి ప్రమిదలు చేయడం, ఇలా చాలా ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఫాం హౌష్‌లో తన భర్తతో కలిసి కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తోన్న ఫొటోను పోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వర్షాకాలానికి స్వాగతం అని ఈ ఫొటోకు పోనీ క్యాప్షన్ పెట్టారు. కాగా, పోనీ స్వతహాగా కొరియోగ్రాఫర్. ఆమెను ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ మొదట 1994లో తమిళ నటి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. ఈమె నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి సోదరి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. అయితే, 2009లో లలిత కుమారి నుంచి ప్రకాష్ రాజ్ విడిపోయారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ సంతానం. ప్రకాష్ రాజ్ తన సంపాదనలో కొంత మొత్తం చారిటీకి కేటాయిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసి అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZSAcwn

చిరంజీవి కుటుంబంపై తేనెటీగల దాడి.. అంతా సేఫ్

చిరంజీవి కుటుంబంపై తేనెటీగల దాడి.. అంతా సేఫ్




from Telugu Samayam https://ift.tt/3dmZTJe

సూపర్ కృష్ణపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా అనేక విషయాలపై స్పందిస్తూ వస్తున్న మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా కృష్ణ బర్త్ డే సందర్భంగా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ గురించి నాగబాబు పలు విషయాలు తెలిపారు. 'నా అభిమాన నటుల్లో ఒకరైన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్‌ శకం ప్రారంభం కాకముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణగారు ఉండేవారు. నా అభిప్రాయం ప్రకారం కృష్ణ గారు ట్రెండ్ సెట్టర్‌' అని అన్నారు నాగబాబు. అంతేకాదు 'మొదటి 70 ఎంఎం, డీటీఎస్, సినిమాస్కోప్, ఈస్ట్‌మన్‌ కలర్, స్పై సినిమాలు ఆయనవే. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి.. చాలా మందికి సాయం చేశారు' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఆయనను ఎప్పుడూ మరిచిపోలేం. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటుూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు నాగబాబు. ఇక పోతే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు చిరు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. చిరుతో పాటు టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు కృష్ణకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yOuMrb

‘సర్కారు వారి పాట’ నీకు మరో మైలురాయి కావాలి: పూరి జగన్నాథ్

ప్రతి సంవత్సరం తన తండ్రి నటశేఖర కృష్ణ జన్మదినం పురష్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కచ్చితంగా ఒక అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ కాస్త పొడవాటి జుట్టు, ఇప్పుడిప్పుడే వచ్చిన గెడ్డం, మెడ మీద రూపాయి బిల్ల టాటూ, చెవికి రింగుతో మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌తో కనిపించారు. ఈ పోస్టర్‌లో మహేష్ లుక్‌ను పూర్తిగా చూపించకపోయినా.. ఈ హాఫ్ మాస్ లుక్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ ఇండస్ట్రీలోని ఒక టాప్ హీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. మహేష్‌తో సినిమా తన కల అని.. ఆ కల నెరవేరుతోందని ఆయన అంటున్నారు. అయితే, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పరశురామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: ‘‘నీ చిన్న తనం నుంచి నీ ప్రయాణాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. ఇప్పుడు నీ ప్రయాణంలో ‘సర్కారు వారి పాట’ మరో మైలు రాయి కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా పరశురామ్. ఫస్ట్ లుక్, టైటిల్ రెండూ బాగా నచ్చాయి. మహేష్ బాబు అభిమానులు కచ్చితంగా సంబరాలు చేసుకుంటారు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్‌కు పరశురామ్ తమ్ముడి వరస. పరశురామ్‌ది కూడా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గర పల్లెటూరే. పూరి జగన్నాథ్‌ స్ఫూర్తితోనే దర్శకుడు కావాలని పరశురామ్ హైదరాబాద్ వచ్చారు. ఎంబీఏ పూర్తిచేసిన పరశురామ్.. సినిమాలపై ఆసక్తితో మొదట ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2008లో ‘యువత’ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తరవాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలతో ఫర్వాలదేనిపించినా.. ‘సారొచ్చారు’తో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా దెబ్బతో సుమారు నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరశురామ్. అయితే, 2016లో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ద్వారా నిర్మాత అల్లు అరవింద్.. పరశురామ్‌ను ఆదుకున్నారు. అదే బ్యానర్‌లో 2018లో పరశురామ్ చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో పరశురామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZPEF2V

అనసూయ పీరియడ్స్ స్టోరీ: ఫస్ట్ పీరియడ్ సమయంలో! చెబితే గానీ అర్థం కావంటూ ఓపెన్ కామెంట్స్

ప్రతీ అమ్మాయి జీవితంలో పీరియడ్స్ (నెలసరి) సమయం అనేది ఎంతో కీలకమైన అంశం. ఈ సృష్టికి మూలం కూడా అదే. అలాంటి పీరియడ్స్ గురించి మాట్లాడటానికి, బయట చెప్పుకోవడానికి సిగ్గు పడుతూ అదేదో నేరం అన్నట్లుగా గోప్యంగా ఉంచుతుంటారంతా. కానీ జబర్దస్త్ బ్యూటీ మాత్రం.. తాను అందరిలో బిన్నం అని నిరూపిస్తూ పీరియడ్స్ స్టోరీ చెప్పి ఆ విషయాలపై ఓపెన్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ధైర్యంగా ఓ వీడియో షేర్ చేసి సంచలనం సృష్టించింది. దాదాపు 7 నిమిషాలున్న ఈ వీడియోలో పీరియడ్స్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది అనసూయ. ఈ మేరకు తన మొదటి పీరియడ్ అనుభవాలను సైతం పంచుకుంది. మే 28న అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంభందించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈ విషయాలపై స్పందించింది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. Also Read: పీరియడ్స్ సమయంలో మహిళలకి సాయం అవసరమని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం సరైందికాదని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సమాజంలో చాలా చోట్ల పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయని, పీరియడ్స్ అనేది తప్పు కాదని.. అమ్మాయిలు వాటి గురించి మాట్లాడటానికి భయపడకూడని అభిప్రాయపడింది అనసూయ. కొందరు మగవాళ్ళు పీరియడ్స్ సమయంలో అమ్మాయిలను అర్థం చేసుకోకుండా లోకువగా చూడటం సహించరానిదంటూ సీరియస్ అయింది. ఇంటికి మహాలక్ష్మి, ప్రపంచానికి మూలం ఆడవాళ్లే అని ఆమె చెప్పింది. ఇక తన మొదటి పీరియడ్ అనుభవాల గురించి పేర్కొంటూ.. ఫస్ట్ పీరియడ్ సమయంలో చాలా టెన్షన్ పడ్డానని చెప్పింది. ఆ సమయంలో దాదాపు రెండు వారాలు ఇంట్లోనే ఓ మూలాన కూర్చోబెట్టారని, ఆ తర్వాత ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో మూడు నాలుగు రోజులు ఎవరినీ కలిసే ఛాన్స్ ఉండేది కాదని చెప్పింది. అయితే మొదట్లో తనకు ఈ విషయమై ఏం జరుగుతుందో తెలియకపోయినా 17 ఏళ్లు వచ్చిన తర్వాత అంతా అర్థమైందని తెలిపింది. ఇలాంటి విషయాలు దాచుకోకూడదని.. ఇవి ఇలా బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36SZ3Sk

అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయి.. అయినా తప్పు చేయనపుడు భయమెందుకు: రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తన అభిప్రాయాలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టైల్. తనకేదనిపిస్తే అది మీడియా ముందే నిర్మొహమాటంగా బయటపెట్టే ఆయన.. ఈ కరోనా పరిస్థితుల్లో మరింత హల్చల్ చేశారు. కరోనా వైరస్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేసిన వర్మ.. అదే కరోనా వైరస్‌పై మూవీ కూడా రూపొందించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండగా ఈ మూవీ ఎలా షూట్ చేశారు? ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించారా? అనే దానిపై జనాల్లో నెలకొన్న అనుమానాలను తెరదించేలా తాజా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని, రూల్స్ ఫాలో అవుతూనే కరోనావైరస్ సినిమాను రూపొందించడం జరిగిందని అన్నారు వర్మ. తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవని ఆయన అంటున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ యూనియన్ సభ్యుడిని షూటింగ్ కోసం తీసుకోలేదని, ఎవరినీ సంప్రదించలేదని ఆయన తెలపడం విశేషం. అయితే తమ పరిధిలోనే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను షూట్ చేయడం జరిగిందని వర్మ తెలిపారు. Also Read: నిబంధనలకు అనుగుణంగా నడచుకొన్నప్పుడు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదని, అలాగే తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచనవసరం అస్సలు లేదని పేర్కొంటూ మరోసారి తన నైజం బయటపెట్టారు వర్మ. కరోనావైరస్ మూవీని లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన వారం రోజుల తర్వాత ప్రారంభించి.. ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ లాక్‌డౌన్ ముగిసే లోపే కంప్లీట్ చేశామని ఆయన చెప్పడం గమనార్హం. తన నా ఆలోచనలను విజన్‌కు అనుగుణంగా మల్చుకున్నానని, అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయని సంచలన కామెంట్ చేశారు వర్మ. మరోవైపు ఓటీటీ వేదికపై రిలీజ్ చేసేందుకు గాను శృంగార తార మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా ఫినిష్ చేశారు వర్మ. ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి అట్రాక్ట్ చేసిన ఆయన.. జూన్ 6వ తేదీన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఆన్‌లైన్ వేదికపై రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే సినీ పరిశ్రమ అంతా కరోనా కారణంగా నాలుగు గోడల మధ్యే ఉంటే వర్మ మాత్రం తనపని తాను చేసుకుంటూ వెళ్లి మరోసారి విలక్షణత చాటుకున్నాడని తెలుస్తోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36M3k9W

తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

దోమకొండ సంస్థానం వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ కామినేని ఉమాపతిరావు అత్యక్రియల్లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సహా ఇతర కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. కామినేని ఉమాపతిరావు అనారోగ్యంతో ఈనెల 27న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన ఉపాసన కొణిదెల తాతయ్య. ఉమాపతిరావు అంత్యక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం కోటలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. అయితే, అంత్యక్రియలకు పార్థివదేహాన్ని తీసుకుళ్తోన్న సమయంలో అక్కడే ఓ చెట్టుపై నుంచి తేనేటీగలు దాడికి దిగాయి. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కామినేని కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి ఫ్యామిలీని వెంటనే ఇంటిలోకి తీసుకెళ్లారు. తేనెటీగలను అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సుక్షితంగా తప్పించుకున్నారు. వీరంతా గాయపడ్డారని మొదట వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో చిరంజీవి ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. కాగా, తేనెటీగలు కుట్టడంతో నలుగురు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. తేనెటీగలు దాడిచేసే సమయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కూడా అక్కడే ఉన్నారు. తేనెటీగలను చెదరగొట్టిన అనంతరం అంత్యక్రియలను కొనసాగించారు. కాగా, చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడిచేశాయనే వార్త బయటికి రావడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే, వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని ఊపిరిపీల్చుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XgmOAk

NASA Astronauts Head for ISS on Historic SpaceX Flight

Two veteran NASA astronauts were headed for the International Space Station on Saturday after Elon Musk's SpaceX became the first commercial company to launch a rocket carrying humans into orbit,...

from NDTV Gadgets - Latest https://ift.tt/36Nt464

కృష్ణ పాటకు టీడీపీ ఎంపీ కొడుకు స్టెప్పులు... బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

కృష్ణ 77వ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు కుటుంబసభ్యులు రకరకాలుగా విషెస్ చెబుతున్నారు. తాజాగా అల్లుడు సుధీర్ బాబు కృష్ణ నటించిన అల్లూరి సీత రామరాజు సినిమాలో డైలాగ్స్‌తో అదరగొట్టాడు. తాజాగా 'జుంబారే..జుజుంబ‌రే' పాటకు మ‌హేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ కుమారుడు గ‌ల్లా అశోక్ డ్యాన్స్ చేశాడు. ఈ రోజు సందర్భంగా ఈ పాట ప్రొమోను విడుదల చేశారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాలో ఆయన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అచ్చం కృష్టలా అశోక్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు.ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన య‌మ‌లీల సినిమాలో 'జుంబారే' పాటకు ప్రత్యేకంగా కృష్ణ డ్యాన్సుతో అలరిస్తారు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడగా, సాహిత్యం జొన్న‌విత్తుల అందించారు. ఆ పాట‌లో కృష్ణ సరసన పూజా డ్యాన్స్ చేస్తుంది. కాగా, నటిస్తోన్న కొత్త సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, న‌రేశ్‌, స‌త్యా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఈ సందర్బంగా గల్లా అజయ్ ట్వీట్ కూడా చేశారు. తాత నా ఎవర్ గ్రీన్ లెజెండ్.నాతో పాటు వేలాదిమందికి ఆయన ఆదర్శం. ఆయనను అతిదగ్గరగే చూసే అవకాశం నాకు కల్గినందుకు నేనెంతో అదృష్టవంతుడిని’ అంటూ అజయ్ ట్వీట్ చేశాడు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఫేం నిధి అగర్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్‌ బాణీలు అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్లా పద్మావతి నిర్మాత. సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి కలిసి సినిమాను సమర్పిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36MVcWO

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ఆరుబయటే అతనితో రొమాన్స్.. అబ్బో! ఆ హీరోయిన్ వేషాలు చూస్తే..

హీరోయిన్స్ అన్నాక డేటింగ్ వ్యవహారాలు, బ్రేకప్ సంగతులు, ఆ వెంటనే మరో వ్యక్తితో రొమాంటిక్ టూర్స్ అనేవి కామన్. కానీ డేటింగ్ చేసి ఏకంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం, పైగా ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించడం మాత్రం చాలా అరుదైన విషయం. అయితే ఆ పని చేసి చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో బ్యూటీ .. మరోసారి ప్రియుడితో ఆరుబయట రొమాన్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసి సంచలనం సృష్టించింది. రీసెంట్‌గా ఓ బిడ్డకు తల్లైన అమీ.. బహిరంగంగా ఇలా రొమాన్స్ చేయడం, పైగా ఆ రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ ఇష్యూగా మారింది. హాట్ ఫొటోలు, వీడియోలు, రొమాన్స్‌కు సంబంధించిన పోస్టులు, బోల్డ్ స్టేట్‌మెంట్లు పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే అమీ జాక్సన్.. నాలుగు గోడల మధ్యలో చేసుకునే శృంగార సన్నివేశాన్ని ఆరుబయట పెట్టేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న అమీ, అతనితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తోంది. పైగా అందుకు సంబంధించిన పిక్స్ పబ్లిక్‌లో పెట్టేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రియుడు జార్జ్‌ పనాయొటోతో బహిరంగ ప్రదేశంలో రొమాన్స్ చేస్తూ ఆమె కనిపిస్తుండటం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆరుబయట తన ప్రియుడిపై పడుకుని ఉన్న ఫొటో చూసి అబ్బో! ఈ బ్రిటిష్ భామ వేషాలు మామూలుగా లేవుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలంగా ప్రియుడు జార్జ్‌ పనాయొటో ప్రేమాయణం సాగిస్తున్న అమీ జాక్సన్.. . 2019 జనవరి 1 తేదీన ఆయనతో నిశ్చితార్థం చేసుకొని సహజీవనం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ వీరి వివాహం జరగనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత ఆమె తిరిగి వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ciRaGP

నా అభిమాన సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పై రోజా స్పెషల్ ట్వీట్

బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా పేరు గాంచి నాలాంటి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచిన నా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’అంటూ రోజా ట్వీట్ చేశారు. రోజాతో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుమారుడు మహేష్ బాబుతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్, టాలీవుడ్ దర్శకులు విషెస్ తెలిపారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. ఆ తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో విజయనిర్మలను తిరుపతిలో కృష్ణ రెండో పెళ్ళి చేసుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36NmEE0

ఓ సారి కృష్ణ గారు కార్ ఎక్కించుకొని.. ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేను: పూరి జగన్నాథ్

ఈ రోజు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిత్రసీమలోని ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ లెజెండ్‌తో తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాషింగ్ డైరెక్టర్ ఓ ట్వీట్ చేస్తూ అప్పట్లో కృష్ణ గారితో ఉన్న మధుర జ్ఞాపకాన్ని అందరికీ తెలియజేశారు. కృష్ణ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ''పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది. ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్‌లో సినిమా కూడా చూసాం. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం క్యూలో నిలుచునే వాడిని, కానీ ఆ రోజు ఆయన పక్కన కూర్చోవడం అస్సలు మరిచిపోలేను. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రేట్ లెజెండ్ ఆరోగ్యంగా కలకాలం జీవించాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ.. పూరి- మహేష్ కాంబో మరోసారి రిపీట్ కావాలని కోరుతున్నారు. మహేష్ బాబు 28వ సినిమా మీదే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ చేసిన ఈ ట్వీట్‌ని ఛార్మి లైక్ చేయడం విశేషం. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇకపోతే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ రూపొందిస్తున్నారు. ముంబై నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీని మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు పూరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Mg0Bw0

Saturday, 30 May 2020

సాహసానికి మారు పేరు.. కృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 77వ బర్త్ డే నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ .. యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతీ సందర్భంపై ఆయన స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మహేష్ కీలక ప్రకటన చేశారు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’సినిమా టైటిల్‌తో పాటు తన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ముందుగా ప్రచారం అయినట్టు ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారు. చెవికిపోగు, మెడపై రూపాయి నాణెం టాటూ తో మహేష్ సరికొత్త లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మహేష్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zDpNdr

కృష్ణ డైలాగులతో సుధీర్ బాబు వీడియో.. మామను దించేశాడు! వందేమాతరం అంటూ ఎమోషనల్ కిక్

నేడు (మే 31) టాలీవుడ్ నటశేఖరుడు, సూపర్ స్టార్ 77వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. ట్విట్టర్‌లో కృష్ణ బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిపోయిన ఆయన ఇన్నో విజయాలందుకొని అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. పౌరాణిక, జానపద, సాంఘీక, జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల ఏకైన నటుడిగా ఫేమస్ అయిన కృష్ణకు ఆయన అల్లుడు హీరో స్పెషల్ విషెష్ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కిక్ ఇచ్చాడు. డబ్స్ ఫర్ లెజెండరీ సీన్ అంటూ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలోని ఓ ఎమోషనల్ డైలాగ్ చెబుతూ ఆ వీడియో షేర్ చేశాడు సుధీర్ బాబు. బ్రిటిషు సైన్యం ఎదుట అల్లూరి సీతారామరాజుగా కృష్ణ చెప్పిన భావోద్వేగపూరిత డైలాగులను అచ్చం అలాగే చెప్పి వావ్! అనిపించాడు. 'అక్కడ కాదురా.. ఇక్కడ కాల్చు.. వందేమాతరం వందేమాతరం వందేమాతరం' అంటూ ఆకర్షించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధీర్ బాబు ఇటీవలే V సినిమాను పూర్తిచేశాడు. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ మూవీకి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. నాని మరో హీరోగా నటించారు. షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షక లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AqFYui

'China will recover faster than many countries'

'COVID-19 will not stop the expansion of China's 'infrastructure power'.'

from rediff Top Interviews https://ift.tt/3gDgJFV

మహేష్ మెడ మీద రూపాయి బిల్ల.. సర్కార్ వారి పాట లుక్ అదుర్స్

మహేష్ బాబు షూరూ అయ్యింది. మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు. తన కొత్త సినిమా సర్కార్ వారి పాట మరో బ్లాక్ బస్టర్ మూవీ హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తుందంటూ మహేష్ ట్వీట్ చేశాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో మహేష్ లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. చెవి పోగు, మెడపై రూపాయి కాయిన్ టాటూతో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో మహేష్ లుక్ కేక పెట్టాలా కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తండ్రి పుట్టిన రోజున మహేష్ తన అభిమానులకు శుభవార్త అందించాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా అందించాడు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పనిచేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మహేశ్‌ హిట్‌ అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు ముందు మహేష్ చేసిన మహర్షి, భరత్ అనే నేను సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మహర్షి సినిమా కూడా మహేష్ ఇమేజ్‌ను మరింత పెంచింది. దీంతో ఇప్పుడు సర్కార్ వారి పాట అనే పేరుతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించేందుకు టాలీవుడ్ ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3chMSQ6

అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్.. సూపర్ స్టార్‌ కృష్ణకి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్

తెలుగు సినిమా చరిత్రలో అలుపెరగని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికలపై పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పెద్దలు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, నటీనటులు సహా అభిమానులు అందరూ పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు 'హ్యాపీ బర్త్ డే కృష్ణ గారు' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. కాగా సందర్భంగా ఆయనకు స్పెషల్ విషెస్ చెబుతూ విలువైన సందేశాన్ని పోస్ట్ చేశారు మెగాస్టార్ . ''కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు'' అని పేర్కొంటూ ఆయనతో దిగిన ఓ అపురూమైన పిక్ పంచుకున్నారు చిరంజీవి. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ చూసి మెగా అభిమాన వర్గాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. అదే సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆన్ లైన్ వేదికలను హోరెత్తిస్తున్నారు మెగా ఫ్యాన్స్. కృష్ణ అంటే ఓ కెరటం అని, ఆ లెజెండరీ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని కామెంట్ చేస్తూ బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XOcKhd

Coronavirus Contact Tracing Apps: Which Countries Are Doing What

As countries emerge from lockdowns imposed to blunt the coronavirus pandemic, dozens have rolled out phone apps to track a person's movements and who they come into contact with, giving officials a...

from NDTV Gadgets - Latest https://ift.tt/36MaFGL

HappyBirthDay Krishna: సుదీర్ఘ సినీ ప్రస్థానం.. ఎన్నెన్నో మలుపులు.. తెలుగు సినీ చరిత్రలో!!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన, ఆయన సినీ కెరీర్‌కి సంబంధించిన ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలుపెరగని సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న కృష్ణ జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చిన్న నటుడిగా ఆరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. 1942 సంవత్సరం మే 31న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1965లో హీరోగా వెండితెరపై మెరిశారు. ఆయన తొలి సినిమా ‘తేనె మనసులు’. తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై 55 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆయన తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గూఢచారి 116 మూవీ కృష్ణ కెరీర్‌కి గట్టి పునాది వేసింది. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలా పడిన పునాదిపై నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌ కొనసాగిస్తూ 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో ఆయన అభినయించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి పలు విజయవంతమైన సినిమాలు రూపొందించారు. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడి గానూ 16 సినిమాలు తీసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం. ఇకపోతే తెలుగు సినీ ప్రేక్షకులకు మొట్టమొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా కృష్ణనే. ఆ రోజుల్లోనే ముందుచూపుతో టెక్నికల్‌గా తెలుగు సినిమాను ఖ్యాతిని ప్రపంచానికి చాటే గొప్ప ప్రయత్నాలు చేశారాయన. అలా ఎన్నో సినిమాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న 'తేనె మనసులు' మూవీ కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటన ఇచ్చారు. అది చూసి స్పందించిన కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపిక చేశారు. అలా సినీ కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు సినీ చరిత్రలోనే విలక్షణ నటుడు, ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు కృష్ణ. కృష్ణ కుటుంబ నేపధ్యాన్ని చూస్తే.. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారి పేర్లు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేక పోయాడు. 90ల్లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి, తర్వాతి దశలో సినీ నిర్మాతగా వ్యవహరించారు. 1987-90 మధ్యకాలంలో దాదాపు తన ఏడు సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కొడుకు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమై వరుస హిట్స్ సాధిస్తూ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZP6UyJ

వలస కార్మికుల కోసం విమానం.. సోనూ సూద్ ‌పై సీఎం ప్రశంసలు

కరోనా లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు వెతలు పడుతున్న వేళ వారి పాలిట దైవంలా దిగివచ్చాడు... ప్రముఖ స్టార్ సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన.. సోనూ నిజ జీవితంలో మాత్రం నిజంగా హీరో అయ్యాడు. ఆయన వలస కార్మికుల కోసం చేసిన సాయం ఏ ఒక్క భారతీయుడు మరిచిపోలేనిది. సొంత రాష్ట్రాలకి వెళ్ళేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎందరో వలస కార్మికులు కాలి బాట పట్టారు. వీరిని చూసి చలించిన తన శక్తివంచన మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. వేలాది మంది వలస కార్మికులని సొంత గూటికి చేర్చారు. ఇటీవల కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను ప్రత్యేక ఫ్లైట్ ద్వారా స్వస్థలానికి చేర్చారు. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. తాజాగా సోనూ సూద్ చేసిన ఈ పనిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆపత్కాలంలో సోనూ చేస్తున్న సేవలకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోనూను ప్రశంసించారు. ''ఒడిశా మహిళలకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కు ధన్యవాదాలు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు చొరవ చూపారు. ఆయన మానవతాదృక్పథాన్ని ప్రశంసించి తీరాల్సిందే''అని ట్వీట్‌ చేశారు. సీఎం పట్నాయక్ ట్వీట్‌కి సోనూ సూద్ కూడా స్పందించారు. కేరళలో చిక్కుక్కుపోయిన నా అక్కా చెల్లెళ్ళని ఇంటికి పంపండం నా బాధ్యతగా భావించాను. మీ మాటలు నాలో స్పూర్తిని నింపాయి. ధన్యవాదాలు సార్. దేశంలోని వలస కార్మికులని వారి స్వస్థలాలకి పంపేందుకు నేనే ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటాను అని బదులిచ్చారు సోనూ. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్ కార్మికులను ఇప్పటివరకు సోనూసూద్ ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో అతని కుటుంబం,స్నేహితులు సైతం అతనికి అండగా నిలిచారు. తనకు ప్రశంసలు అవసరం లేదని.. ప్రజల ఆశీర్వాదమే చాలని అంటున్నారు సోనూ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2B9Q2Z5

మీరే నా సూపర్ స్టార్.. కృష్ణ పుట్టినరోజున మహేష్ బాబు ట్వీట్

టాలీవుడ్ నటశేఖరుడు, ఘట్టమనేని ఇవాళ 77వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల్ని అలరించారు. తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు కృష్ణ. వెండితెరపై మెరిసిన అందగాడు. అలాంటి టాలీవుడ్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది.ఇవాళ కృష్ణ బర్త డే సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు, కోడలు నమ్రత, మనవరాలు సితారతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు నాన్న.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ అంటూ చేశారు. తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణ ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే తాత గారు.. లవ్ యూ వెరీ మచ్.. ఈ రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని విషెస్ తెలిపింది. ఈ రోజు సందర్భంగా మహేష్ 27వ చిత్రం లాంచ్ కానుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MdDKRZ

WeTransfer 'Partially' Blocked in India, Company Says

WeTransfer, a popular file transfer service that has been used by a large number of Internet users across the globe, has "partially" been blocked in India.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dd6VQR

Allu Arjun: అల్లు బ్రదర్స్ విడిపోయారా? ఈ సెలబ్రేషన్స్ చూసి ఆ మాట అనగలరా?

ఈరోజు (మే 30) అల్లు వారి చిన్నబ్బాయి పుట్టిన రోజు. దీంతో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. తన అన్నలు , అల్లు బాబీలతో పాటు తన వదినలు, పిల్లలు, అల్లు అరవింద్ సతీ సమేతంగా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. స్వయంగా బన్నీ భార్య స్నేహా రెడ్డి మరిది కోసం కేక్ తయారుచేసి తీసుకువచ్చిందని తెలియజేస్తూ.. ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు అల్లు శిరీష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే సొంతంగా సెపరేట్ హౌస్ కొన్న అల్లు శిరీష్ ఆ కొత్త ఇంటికి షిప్ట్ అయ్యాడు. అయితే ఇటీవల అల్లు వారి అబ్బాయిలకు ఆస్తి పంపకాలు జరిగాయని వార్తలు రాగా.. ఆ పంపకాల్లో భాగంగా అల్లు శిరీష్ తన తట్టా బుట్టా చేత పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు.. ఒంటరి వాడు అయిపోయాడు.. అయ్యో పాపం.. అంటూ ప్రముఖ వెబ్ సైట్స్‌లో కథనాలు వచ్చాయి. ఇష్టపడి కొనుక్కున్న ఇంటికి వెళ్లిన పాపానికి అల్లు శిరీష్‌కి తన ఫ్యామిలీతో చెడిందంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి అల్లు శిరీష్ హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ నిర్మాణ రంగంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకు అనుగుణంగా ఉండేందుకు అతను నచ్చినట్టుగా ఆఫీస్ అండ్ హౌస్ పర్పస్‌లో సొంతంగా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. అలా కొత్త ఇంటికి షిఫ్ట్ కావడంతో అల్లు శిరీష్‌పై రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. మొత్తానికి తన బర్త్ డే సందర్భంగా.. అల్లు ఫ్యామిలీ అంతా ఒకటే అని తెలియజేస్తూ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి రూమర్స్‌కి చెక్ పెట్టారు అల్లు శిరీష్. ఇక అల్లు అర్జున్ అయితే తన తమ్ముడు అంటే ఎంత ప్రేమో తెలియజేస్తూ.. ఈ ప్రపంచంలో నువ్ ఎప్పుడూ నా ఫేవరేట్ బేబీవి అంటూ తమ్ముడితో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సో.. అల్లు బ్రదర్స్ విడియారంటూ ప్రచారం చేసిన వాళ్లు ఈ సెలబ్రేషన్స్ చూసి ఆ మాట అనగలరా అంటూ అల్లు హీరోల ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XJnPjx

జగన్ సర్కార్‌పై ఆ వ్యాఖ్యలు చేయలేదు, వారిపై కేసు పెడతా.. నటుడు రావు రమేష్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ నటుడు పేరుతో చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా రావు రమేష్ చేసిన ట్వీట్లేనని భావించి నెటిజన్లు వేల సంఖ్యలో రీట్వీట్లు చేస్తున్నారు. ‘‘మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ - మీ రావు రమేష్’’ అంటూ ప్రజావేదిక కూల్చివేత గురించి రావు రమేష్ పేరు మీదుగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే ‘‘పోలవరం ప్రాజెక్ట్ వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఎంత పని చేశారో చెప్పండి?’’ అంటూ చేసిన ట్వీట్ సైతం చక్కర్లు కొడుతోంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను హైకోర్టు తిరిగి నియమించడంపై కూడా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్న ట్వీట్ సైతం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సదరు ట్విట్టర్ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు రావు రమేష్‌ను సంప్రదించగా ఆ ట్వీట్ తాను చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ స్పష్టం చేశారు. ‘‘మీడియా మిత్రులకు, నన్ను, నా నటనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ.. నాకు సోషల్‌ మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్ గాని, ట్విటర్ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏమీ లేవు. ఈ రోజు నా పేరు మీద ఎవరో ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద త్వరలోనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టబోతున్నాను’’ అని రావు రమేష్ తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36Jx7Qv

Google Delays Android 11 Beta Launch Show Amid US Protest

Google on Saturday said it has postponed next week's planned unveiling of the beta version of its latest Android 11 mobile operating system in light of protests and unrest in the United States.

from NDTV Gadgets - Latest https://ift.tt/2TTBfrZ

SpaceX, NASA to Try Again for Landmark Launch of 2 Astronauts From US Soil

Elon Musk's private rocket company SpaceX was set for a repeat attempt at launching two Americans into orbit on Saturday from Florida for a mission that would mark the first spaceflight of NASA...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TTIP66

OnePlus 8 Pro Color Filter Camera Disabled for Global Users by Mistake

OnePlus 8 Pro users in the global markets have received a new OxygenOS update that has "inadvertently" disabled the Color Filter camera that was recently found to have "see-through"...

from NDTV Gadgets - Latest https://ift.tt/3cezzj5

రఘు కుంచే కూతురు నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుతురుకు నిశ్చితార్థం నిర్వహించారు. రీసెంట్‌గా తన కూతురు రాఘ ఎంగేజ్‌మెంట్‌ని ఆశిష్ వర్మ అనే వ్యక్తితో జరిగింది. దీంతో రఘు కూతురు నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రఘుది ప్రేమ వివాహం. కరుణ అనే క్లాసికల్ డాన్సర్‌ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి రాగ పుష్యమి.. గీతార్థ్ అనే అబ్బాయి ఉన్నారు. తాజాగా అమ్మాయి రాగకే నిశ్చితార్థం నిర్వహించారు రఘు దంపతులు. రఘుది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర గాదరాడ అనే ఊరు. బాచి మూవీతో రఘు మ్యూజికల్ జర్నీ మొదలైంది. బాచీ సినిమాలో రఘు పాడిన లచ్చిమి లచ్చిమి పాటకు పేరు రావడంతో ఆయనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. తరువాత చిరంజీవి తన మృగరాజు సినిమాలో ఒక పాటను పాడే అవకాశం కల్పించాడు. తరువాత దేశముదురు, శివమణి లాంటి చిత్రాల్లో పాడిన పాటలతో కెరీర్ మరింత పుంజుకుంది. మరో పక్క వినీత్, అబ్బాస్, అరవింద్‌ స్వామి, దీపక్‌ లాంటి చాలామందికి డబ్బింగ్‌ కూడా చెప్పాడు. సంపంగి సినిమాకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్నీ అందుకున్నాడు. బంపర్ ఆఫర్ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఆ సినిమాలో రఘు పాడిన పెళ్ళెందుకే రవణమ్మా అనే పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది. అదే సినిమా సంగీత దర్శకుడిగా నంది అవార్డు లభించింది. మర్యాద రామన్న సినిమాలో కీరవాణి.. రఘుకు రాయె రాయె సలోనీ పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఆ పాట కూడా మంచి విజయం సాధించింది. రఘు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీత దర్శకుడిగానే కాకుండా సింగర్‌గా, యాంకర్‌గా, నటుడిగాను అలరించాడు. ముఖ్యంగా తన వాయిస్‌తో లక్షలాది ప్రజల ఆదరాభిమానాలు పొందాడు రఘు. 600కి పైగా పాటలు పాడిన రఘు 5 నంది అవార్డులు కూడా అందుకున్నారు. అనేక టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా అలరించాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cfGgS7

బాలయ్య Vs నాగబాబు వివాదంలోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ.. వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?

‘మేంమంతా ఒక్కటే.. అనవసరంగా మీరే చించుకుంటారు’ అని మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బహిరంగంగానే ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి మాట్లాడినా.. హీరోల మధ్య చిన్న చిన్న విభేదాలు మాటలు వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ తమ తమ విశ్వరూపం చూపిస్తున్నారు. చొక్కాలు చింపుకుని మరీ.. ఏయ్.. వేసేస్తాం పొడిచేస్తాం అంటూ పోటుగాళ్లలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి చివరికి ఎవరినైతే వీళ్లు భుజాన వేసుకుని బయలు దేరారో వాళ్లే భూజాలపై చేతులేసుకుని కిస్సులు పెట్టుకుంటుంటే వీళ్ల కోసమేనా మేం కొట్టుకుచచ్చింది అని సిగ్గు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో బాలయ్య-నాగబాబుల మధ్య వైరం నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైరంగా మారింది. తాజాగా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ చర్చలకు నందమూరి ఫ్యామిలీని దూరం పెట్టడంపై ఫైర్ అయ్యారు బాలయ్య. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని.. తనని ఆ చర్చలకు పిలవలేదని.. భూములు పంచుకోవడం కోసమే ఈ చర్చలు జరిపినట్టు ఉన్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పిలవలేదంటే పిలవలేదని అడగాలి కాని.. రియల్ ఎస్టేట్ అంటూ మాట్లాడటం తప్పు.. మర్యాదగా క్షమాపణ చెప్పాలి లేదంటే బాగోదని వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఆయన వ్యక్తిగతమే అయినా.. నందమూరి ఫ్యామిలీ ప్రస్తావన తీసుకుని రావడంతో రాజధాని భూములు తదితర అంశాలను ప్రస్తావించడంపై వివాదం మరింత ముదిరింది. తరచూ చిన్న విషయానికి పెద్ద విషయానికి నాగబాబు.. బాలయ్యను టార్గెట్ చేయడంపై నందమూరి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో నాగబాబుని స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ పాత విషయాలని తవ్వితీస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గతంలో బాలయ్య ఎవరో తెలియదు అంటూ కామెంట్స్ చేసిన నాగబాబు ఇప్పుడు ఏ బాలయ్యను క్షమాపణ చెప్పమంటున్నారు అంటూ బూతులు తిడితూ వీడియోలు పెడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇక మెగా ఫ్యాన్స్ కూడా బాలయ్యకు మద్దతు ప్రకటిస్తూ బాలయ్య ఫ్యాన్స్‌‌కి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి మెగా-నందమూరి హీరోల ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో నాగబాబు సన్.. మెగా ప్రిన్స్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఎవర్ని అన్నారు.. ఎందుకు అన్నారు.. చెప్పకుండానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎక్కుపెట్టిన బుల్లెట్ దిగాల్సిన వాళ్లకు దిగిపోయింది. ‘చేతిలో గన్ ఉన్నవాళ్లతో మాట్లాడుకోవడాల్లేవ్’ అంటూ.. గన్ చేతిలో పట్టుకున్న గద్దలకొండ గణేష్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు వరుణ్ తేజ్. అయితే సేమ్ టు సేమ్ అంటూ బాలయ్య గన్ పట్టుకుని గిరా గిరా తిప్పుతున్న వీడియోలతో సమాధానం ఇస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక వరుణ్ తేజ్‌ని సైతం ట్రోల్ చేస్తూ బూతులు మొదలుపెట్టారు. ఇక వరుణ్ తేజ్ ట్వీట్‌కి మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. సూపర్ కౌంటర్ అదిరపోయిందన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య వర్సెస్ నాగబాబు వార్‌లోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ ఇవ్వడం వివాదం మరింత రంజుగా మారింది. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yM2OfH

Samsung Galaxy M11, Galaxy M01 India Launch Set for June 2

Samsung Galaxy M11 and Galaxy M01 are set to launch in India on June 2, Flipkart revealed through a couple of teasers.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZPmUAF

Balakrishna: ‘పిచ్చి కుక్కలతో జాగ్రత్త’.. ఫొటోతో మరింత రచ్చ రేపిన నాగబాబు

మెగా బ్రదర్ వెనక్కి తగ్గేట్టు కనిపించడంలేదు. బాలయ్యతో వైరానికి సై అంటే సై అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి తనను పిలవ లేదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటూ బాగోదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. అయితే బాలయ్య మాట్లాడిన తీరు తప్పు కావొచ్చు కాని ఆయన వాదనలో న్యాయం ఉందని అనేవారు కొందరైతే.. రియల్ ఎస్టేట్ లాంటి పదాలను ఉపయోగించాల్సింది కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ నాగబాబుని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల ముందు బాలయ్య ఎవరో తెలియదంటూ నోటి కొచ్చినట్టు మాట్టాడిన నాగబాబు.. బాలయ్య ఎవరో తెలియకుండానే క్షమాపణ చెప్పమంటున్నారా? ఇంతకీ నాగబాబు ఏ బాలయ్యకి క్షమాపణ చెప్పమన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే నాగబాబుని పచ్చిబూతులు తిడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమై మెగా బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో తనను ట్రోల్ చేస్తున్న వారిని పిచ్చి కుక్కలతో పోల్చుతూ మరో వివాదాస్పద పోస్ట్ చేశారు నాగబాబు. పళ్లు బయటకు పెట్టి అరుస్తూ భయంకరంగా ఉన్న పిచ్చి కుక్క ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇది పిచ్చి కుక్కల కాలం అంటూ మంట పెట్టే పోస్ట్ పెట్టారు నాగబాబు. ‘పిచ్చి కుక్కలు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్యశాఖ చెబుతోంది. అలాంటి కుక్కల్ని నిర్బంధంలోనైనా ఉంచాలి.. చంపేయాలి.. కానీ అలా వదిలేయకూడదు.. అవి జీవితాన్ని బలి తీసుకుంటాయి.. అసలే ఇది పిచ్చి కుక్కల సీజన్’ అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. అయితే ఈ ట్వీట్‌కి నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతూ.. నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ‘అందుకే పిచ్చి కుక్కలైనా మిమ్మల్ని 1 కి పరిమితం చేసాం. అది కూడా ఇపుడు మా ట్రీట్మెంట్‌తో దారిలోకి వచ్చింది. నీకేమో పాపం కళ్ళు మండుతున్నట్టున్నాయి’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పాలకొల్లు, భీమవరం, నర్సాపురం అంటూ పవన్, నాగబాబు, చిరంజీవి ఫొటోలను పెట్టి మరీ వాళ్లు ఓడిపోయిన విషయాన్ని తెలియజేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే మెగా ఫ్యాన్స్ నాగబాబుకి మద్దతు ప్రకటిస్తూ బాలయ్య సినిమాల్లోని డైలాగ్‌లను, ఫొటోలను కామెడీ కోసం వాడేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అటు బాలయ్య, ఇటు నాగబాబుల కామెంట్స్ నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వైరంగా మారాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36J2PNN

మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్

సంక్రాంతి పండగకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సాంగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందులో మైండ్ బ్లాక్ పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ పాటలో మహేష్ స్టెప్పులు, రష్మిక చిందుల్ని అందర్నీ కట్టిపడేశాయి. తాజాగా ఈ పాటకు ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెఫ్టెన్ స్టెప్పులేశాడు. తన భార్యతో కలిసి మైండ్ బ్లాక్ పాటకు డాన్స్ వేసి నెటిజన్స్‌ను ఫిదా చేశాడు. డేవిడ్ వార్నర్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తానంటూ నిన్నే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కరోనాతో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. తన వైఫ్ క్యాండిస్‌తో కలిసిఅదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ పాటలకు కూడా వార్నర్ చిందులేసిన విషయం తెలిసిందే. అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా'‌తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో అదరగొట్టాడు. వార్నర్ వీడియోలపై అల్లు అర్జున్ సైతం స్పందించాడు. ఇక మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి, ప్రభాస్ బాహుబలి డైలాగ్స్‌తో మెప్పించి తెలుగు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. అంతే కాదు కమల్ హాసన్ పాటకు కూడా వార్నర్ డాన్స్ వేశాడు. దాదాపు అందరి హీరోలను కవర్ చేసిన వార్నర్.. అందరివాడయ్యాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్‌కు స్పెషల్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు పక్కా లోకల్ సాంగ్‌తో బర్త్‌డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు. వార్నర్ సౌతిండియన్ స్టార్స్‌ను సంబంధించి టిక్ టాక్ చేయడంతో తెలుగు అభిమానులకు ఇప్పుడు వార్నర్‌ మరింత దగ్గరవుతున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dsQwYs

Prototype of New SpaceX Rocket Starship Explodes on Texas Test Pad

A prototype of SpaceX's upcoming heavy-lift rocket, Starship, exploded on Friday during ground tests in south Texas as Elon Musk's space company pursued an aggressive development schedule to fly the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2XeC2Wv

'No Decision' on Next Launch Attempt for Historic SpaceX-NASA Mission

A final decision on a launch attempt for SpaceX's milestone mission to the International Space Station on Saturday afternoon will take place after assessing the weather that morning, NASA chief Jim...

from NDTV Gadgets - Latest https://ift.tt/2MehrLW

Twitter Has More Tools to Use Against Trump, if It Chooses

Twitter's moves to label or hide comments from President Donald Trump have escalated a feud between the social network and the White House, but there could be more to come.

from NDTV Gadgets - Latest https://ift.tt/2XdaBfU

Friday, 29 May 2020

Attack: శృంగార నటి కుమారుడిపై కత్తులతో దాడి

కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ దాడిలో విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానికులు స్థానికంగా ఉన్న వడపళనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు నుంగంబాక్కం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు ఆరోపిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36KnuBg

Dasari: టాలీవుడ్ లెజెండ్.. దాసరి నారాయణ వర్థంతి నేడు

దర్శకరత్న దాసరి నారాయణ రావు..... తెలుగు సినిమా ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారు లేరు. చిత్ర పరిశ్రమలో లెజెండ్స్‌గా చెప్పుకోదగ్గ ప్రముఖుల్లో దాసరి ఒకరు. దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పత్రిక అధిపతిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అందరి తలలో నాలుకలా మెదిలిన దాసరి చనిపోయి నేటికి మూడేళ్లు. 2017 మే 30న ఆయన ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయారు. ఇవాళ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్న స్మరించుకుంటున్నారు. 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో దాసరి జన్మించారు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. దాసరి తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. వారిలో దాసరి మూడో వాడు. చిన్నప్పట్నుంచే దాసరికి నాటకాలపైనా, సాహిత్యంపైనా మక్కువ. ఆ ఇష్టంతోనే దాసరి ఏడో తరగతిలోనే ‘నేనూ.. నా స్కూలు’ పేరుతో 15 నిమిషాల నాటిక రాశారు. 1962లో ప్రణాళికా ప్రచారంపై హైదరాబాదులో జరిగిన నాటక పోటీలో రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. దాసరి నారాయణరావు... అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. దాసరి లేకపోయిన ఆయన తీసిన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. గౌరి ప్రొడక్షన్స్‌ భావనారాయణ తాను తీస్తున్న ‘పర్వతాలు పానకాలు’ చిత్రానికి రచయితగా దాసరికి తొలి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’, ‘జగత్‌ కిలాడీలు’, ‘జగజ్జెట్టీలు’, ‘దేవాంతకులు’, ‘స్నేహబంధం’ సినిమాలకి కథకుడిగా, సంభాషణల రచయితగా వ్యవహరించారు. దర్శకుడిగా 1973లో దాసరి ‘తాత మనవడు’ సినిమా తీశారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేయాల్సిన సబ్జెక్టుతో ఆ చిత్రాన్ని రూపొందించి శభాష్‌ అనిపించుకున్నారు దాసరిలోని దర్శకుడు. వయసుమళ్లిన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, తమ సరదాలు, షికార్లే ముఖ్యమనుకొనేవాళ్లకు చెంపమీద కొట్టినట్లుగా ఉండే కథతో, దానికి తగ్గ సంభాషణలతో రచయితగానూ ‘ఇతను మామూలోడు కాదు’ అని గుర్తింపు పొందారు. తెలుగు సినిమా కథని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు దాసరి. ఆయన సినిమాల్లో సామాన్యుడే కథానాయకుడు. వారి కష్టాలే కథలు. ఈతి బాధలే కథనం. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M8Ntsy

Zoom Plans to Roll Out Strong Encryption for Paying Customers

Zoom plans to strengthen encryption of video calls hosted by paying clients and institutions such as schools, but not by users of its free consumer accounts, a company official said on Friday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eBZqmD

Netflix Acquires Hollywood's Historic Egyptian Theatre

Netflix completed its purchase of Hollywood's historic Egyptian Theatre on Friday, helping to confirm the streaming giant's newfound central position in the movie industry.

from NDTV Gadgets - Latest https://ift.tt/3eyloqN

Twitter, Others Oppose Rule for US Visitors to Disclose Social Media Info

Twitter, Reddit and a group representing major Internet firms backed two documentary film groups that have challenged the Trump Administration's 2019 rules requiring nearly all US visitors to disclose...

from NDTV Gadgets - Latest https://ift.tt/36N5ENV

Google's New Sodar Tool Helps Android Smartphone Users Keep Social Distance

Google-developed Sodar tool available this week taps into Android smartphone cameras to put users in the center of a white circle with a radius of about two meters, or 6.5 feet.

from NDTV Gadgets - Latest https://ift.tt/36IOn8v

'This was not specifically a COVID package'

'It is a package for a new self-reliant India.'

from rediff Top Interviews https://ift.tt/2ZOidHg

Nirupam Paritala: ‘డైరెక్టర్ తేజా అలా చేసేసరికి చాలా ఏడ్చా’ ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్న డాక్టర్ బాబు!

నటన రంగంలో కళామ్మతల్లిని నమ్మకున్నవారికి నటనే దైవం. నటనే జీవితం. సినిమా అయినా.. సీరియల్ అయినా.. పాత్ర ఏదైనా.. లీనమై జీవిస్తే.. ఆ నటుడ్ని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉంటారు. ఆధరిస్తూనే ఉంటారు. నిజానికి వెండి తెరకంటే బుల్లితెర మీద సెలబ్రెటీస్‌కే ఎక్కువ ఫాలోవర్స్ పెరుగుతున్న రోజులు ఇవి. అయితే ఆయా రంగాల్లో మాత్రం ఆ వ్యత్యాసం కచ్చితంగా చూపిస్తారని, సీరియల్‌లో ఒక్కసారి కనిపిస్తే.. సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్‌ ఇవ్వరని, కనీసం ఆడిషన్ కూడా చెయ్యరని, తన జీవితంలోని ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు మన కార్తీకదీపం డాక్టర్ బాబు(). ‘ఎందుకు సినిమాలకు ట్రై చెయ్యకుండా సీరియల్స్ వైపు వచ్చారు? సినిమా హీరోగా ట్రై చెయ్యలేదా మీరు?’ అని అడిగిన ప్రశ్నకు.. నిరుపమ్ ఇలా చెప్పుకొచ్చారు. ‘నేను చాలా కాలం సినిమాల కోసం వెయిట్ చేశాను. అయితే నేను ఎప్పుడూ నాన్నగారు(ఓంకార్ పరిటాల) ఉన్నారనే ధైర్యంతో ఉండేవాడ్ని, ఏదోటి సెట్ చేస్తారులే అనే నమ్మకం ఉండేది. నిజానికి నేను సీరియల్ చెయ్యాలనుకుంటే.. అప్పటికే నాన్నగారి చేతుల్లో రెండు మూడు సీరియల్స్ ఉండేవి. కానీ నేను సినిమానే చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్‌గా నాన్నగారు చనిపోవడంతో.. చాలామంది వెల్ విషర్స్.. సీరియల్ అయినా ఫర్వాలేదు స్టార్ట్ చెయ్యి అని చెప్పారు. దాంతో నేను చంద్రముఖీ సీరియల్ స్టార్ట్ చేసేశాను. అదే నా మొదటి సీరియల్. చంద్రముఖీ చేస్తున్న సమయంలో కూడా నేను సినిమాల కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. చంద్రముఖీ షూటింగ్ చేస్తుండగా గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను షూటింగ్ మధ్యలోంచి వెళ్లాను. తేజా గారు నన్ను చూసి.. తినేసి రా అమ్మా టైమ్ పడుతుంది అన్నారు. షూటింగ్ విషయం, సీరియల్ విషయం చెప్పాలో లేదో తెలియక కాసేపు వెయిట్ చేశాను. చివరికి.. ఇలా ఓ సీరియల్‌లో చేస్తున్నానని తేజాగారితో చెప్పేశాను. దాంతో వెంటనే తేజా గారు లోపలికి వెళ్లిపోయాడు. కో డైరెక్టర్ బయటికి వచ్చాడు. ‘మిమ్మల్ని సీరియల్సే చేసుకోమన్నారు. బయలుదేరమన్నారు’ అని చెప్పాడు. ఆ రోజు లిట్రల్లీ ఇంటి వెళ్లి ఏడ్చేశాను. ఏంటో వచ్చేసింది ఏడుపు. సీరియల్ చేస్తున్నానని.. ఆడిషన్ కూడా చేసుకోకుండా పొమ్మాన్నారేంటీ? అని చాలా బాధొచ్చింది ఆరోజు. అయితే సీరియల్‌ వాళ్లని సినిమాల్లోకి తీసుకోకపోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో లెక్క. డబ్బులు పెట్టకుండానే సీరియల్ వాళ్లు.. రోజు జనాలకు కనిపించేస్తున్నారు. ఇక రేపు డబ్బులు పెట్టి సినిమా చూడటానికి ఎందుకు వస్తారు? అనేది ఓ లెక్కకనుకుంటాను. కొందరికి గుడ్డి నమ్మకాలు ఉంటూనే ఉంటాయి. అలానే నాకు సినిమాల్లో చాలా ఆఫర్స్ పోయాయి. అష్టాచమ్మా సినిమా ఆడిషన్ టైమ్‌లో కూడా అలానే.. జరిగింది. వాళ్లు ఒక సీన్ ఇచ్చి.. రేపు ఆడిషన్ పెట్టుకుందాం అన్నారు. ఆ రోజు నైటే టీవీలో నా సీరియల్ చూశారట. పొద్దున్నే ఆ డైరెక్టర్ ఫోన్ చేసి.. చూశానమ్మా నైట్ నీ సీరియల్ ఇంకొద్దులే ఆడిషన్ అన్నారు. ఏం అంటాం ఇంకా? అందుకే నేను సినిమాల కోసం తిరగడం మానేశాను. తెలిసిన వాళ్ల ద్వారా ఏదైనా అవకాశం ఉంటే చేస్తున్నానంతే. ఇక సీరియల్స్‌తో కంఫర్ట్ బుల్‌గానే ఉన్నాను. అయినా నేను డెస్టినీని ఎక్కువగా నమ్ముతాను..’ అంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BggJvm

Smoking increases your coronavirus risk

'Smokers are a highly susceptible population during this pandemic.'

from rediff Top Interviews https://ift.tt/2ZPL1z7

ఫేస్ మాస్క్‌‌తో ఈ సమస్యలు వస్తాయ్, జాగ్రత్త!

రోనా వైరస్ నేపథ్యంలో అంతా ఇప్పుడు ఫేస్‌ మాస్కులను ధరించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉండేందుకు వీటిని ధరించడం తప్పనిసరి. కానీ, అతిగా మాస్కులను ధరించి ఉండటం కూడా అంత మంచిది కాదు. మాస్కుల వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా మాస్కులను ధరించినట్లయితే చర్మంపై రాపిడికి గురవుతుంది. ఫలితంగా దురద, దద్దుర్లు, గీతలు ఏర్పడతాయి. వాటి వల్ల ముఖం మండుతుంది. అలాగే, వాడిన మాస్కునే పదే పదే వాడితో కొత్త ఇన్ఫెక్షన్లు చర్మంపై దాడి చేయవచ్చు. మాస్కులు శుభ్రంగా లేకపోతే శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కింది చిట్కాలను పాటించండి. మాస్క్‌ల వల్ల వచ్చే సమస్యలు ఇవే: ❂ మాస్క్‌లను ఎక్కువ సేపు ధరించేవారిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నట్లు ఇటీవల ఓ స్టడీలో పేర్కొన్నారు. ❂ చిన్న పిల్లలు ఎక్కువ సేపు మాస్క్ ధరించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ❂ సింథ‌టిక్ మాస్క్‌లు పెట్టుకొనేవారి ముఖంపై ద‌ద్దుర్లు వ‌స్తున్నాయి. ❂ మాస్క్ వల్ల ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడతారని, దీనివల్ల గుండెపై అధిక భారం ప‌డుతుందని స్టడీలో తేలింది. ❂ మాస్కులు అతిగా ధరిస్తే న్యూమోనియా ఏర్పడే ప్రమాదం ఉంది. ❂ రెండేళ్ల కంటే ఎక్కువ వ‌యసున్న పిల్లలు మాత్రమే ఫేస్ మాస్కుల‌ు ధరించాలని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. ❂ స్కిన్ అలర్జీలు ఉన్నవారు మాస్కులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. Also Read: ఈ జాగ్రత్తలు పాటించండి: ✺ నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా ముఖంపై దద్దుర్లు, మంట తగ్గుతాయి. ✺ మాస్క్ లేదా ముసుగు ధరించడానికి ముందు ముఖానికి ఫేస్‌క్రీమ్ రాయండి. ✺ ఫేస్‌క్రీమ్ రాసిన 20 నిమిషాల తర్వాత ముఖానికి మాస్క్ పెట్టుకోవడం మంచిది. ✺ మాస్క్ వల్ల మంట ఎక్కువగా ఉన్నట్లయితే యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోండి. ✺ మాస్క్ తీసిన వెంటనే ముఖాన్ని చేతులతో ముట్టుకోవద్దు. ✺ మాస్క్ తీసిన తర్వాత చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడగాలి. ✺ మాస్క్ తీసిన తర్వాత చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడతాయి. వాటిని అలాగే వదిలేస్తే శాస్వత మచ్చలుగా మిగిలిపోతాయి. అలా జరగకూడదంటే వాసలిన్ లేదా మరేదైనా క్రీమ్ రాయండి. ✺ ముఖానికి ఎక్కువగా చెమట పడితే సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మాస్క్ పెట్టుకొనే ముందు ఆయిల్‌ఫ్రీ క్రీమ్‌ను వాడండి. ✺ N95, N 99, కాట‌న్‌ మాస్క్‌లే సురక్షితం. ఇళ్లల్లో తయారు చేసుకునే మాస్కులు కూడా మంచివే. ✺ స్కిన్ అలర్జీలతో బాధపడేవారు శుభ్రమైన మాస్కులను ధరించాలి. ముఖానికి సౌకర్యవంతంగా ఉండే మాస్కులనే పెట్టుకోవాలి. Also Read:


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2AjuJnH

Balakrishna: చిరు ఇంట్లో CCC కీలకభేటీ.. బాలయ్య వ్యాఖ్యలపై యాక్షన్ ప్లాన్ ఏంటి?

కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కార్మికులు, కళాకారులను ఆదుకునేందుకు మెగాస్టార్ కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీసీసీ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇతర సినీ పెద్దల నుంచి భారీగానే విరాళాలు సేకరించారు. ఇప్పటికే పలు దఫాలుగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ఎన్.శంక‌ర్‌, మెహ‌ర్ ర‌మేష్‌, బెనర్జీ, సి. కళ్యాణ్ సీసీసీలో సభ్యులుగా ఉండగా.. కరోనా వ్యాప్తి, సినిమా షూటింగ్ తదితర అంశాలపై చర్చించడానికి సీసీసీ శుక్రవారం నాడు మరోసారి భేటీ అయ్యారు. చిరంజీవి ఇంట్లో ఈ భేటీ జరుగనుండగా.. తాజాగా ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు పంచుకోవడానికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపగా.. మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నాగబాబు. అయితే ఈ సీసీసీ మీటింగ్‌ తరువాత చిరంజీవి.. బాలయ్య వ్యాఖ్యలపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు సీసీసీ ద్వారా సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చిస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సీసీసీకి బాలయ్య కూడా రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XDedqB

Russian Agents Have Been Hacking Major Email Program: NSA

The US National Security Agency says the same Russian military hacking group that interfered in the 2016 presidential election and unleashed a devastating malware attack the following year has been...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Xcmenh

Infinix Hot 9 Pro, Infinix Hot 9 With Helio P22 SoC Launched in India

Infinix Hot 9 and Infinix Hot 9 Pro phones come with almost identical specifications, apart from slight differences in the rear camera setup. The Infinix Hot 9 Pro has a 48-megapixel main camera at...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZN29Ws

OnePlus 6T, OnePlus 6 Getting OxygenOS 10.3.4 With New Features

OnePlus 6T and OnePlus 6 phones are receiving a new OxygenOS update with the May 2020 security patch. The official changelog shared by OnePlus reveals that OnePlus 6 and OnePlus 6T are getting...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TMPDlK

Trump Escalates War on Twitter, Social Media Protections

US President Donald Trump escalated his war on Twitter and other social media companies Thursday, signing an executive order challenging the lawsuit protections that have served as a bedrock for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2XHUZQu

A Movie Sequel to Sonic the Hedgehog Is in the Works

Sonic the Hedgehog 2 is now in the works. The sequel to Sonic the Hedgehog movie will be made by the returning team of director Jeff Fowler, and writing duo Pat Casey and Josh Miller.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ccDxc4

BSNL Brings Rs. 1,599, Rs. 899 Plans With Up to Rs. 1,500 Talktime: Report

Bharat Sanchar Nigam Limited (BSNL) has reportedly been offering Rs. 1,599 and Rs. 899 prepaid plan vouchers under a special promotional offer in the Odisha circle.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ce47S0

The architect who stole the show in Paatal Lok

'At the end of the day, an actor is hungry for appreciation.'

from rediff Top Interviews https://ift.tt/3c9IYZv

Thursday, 28 May 2020

ఇంట్లోనే ఐబ్రోస్ థ్రెడింగ్ చేసుకోండి ఇలా..

ఐబ్రోస్ ట్వీజర్స్ తో ప్లక్ చేసి, వాక్స్ తో ట్రై చేసి, విసిగిపోయి ఉన్నారా? థ్రెడింగ్ ట్రై చేసి చూడండి. కావాల్సిన వస్తువులు దగ్గర పెట్టుకుంటే హ్యాపీగా మీరే స్వయంగా ఐబ్రోస్ చేసుకుని ఆనందించొచ్చు. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి.. ఎలా చేయాలో తెలుసుకోండి.. కావాల్సిన వస్తువులు 1. మంచి హై-కాటన్ థ్రెడ్ తెచ్చుకోండి. ఈ థ్రెడ్ మీ ముంజేయి దాటి ఇంకో మూడు ఇంచులు ఎక్కువ ఉండేట్లు చూసుకోండి. అంటే అది సుమారుగా 35 సెంటీమీటర్లు, 14 ఇంచులు ఉండాలి. సింథెటిక్ థ్రెడ్ కంటే కాటన్ థ్రెడ్‌తోనే గ్రిప్ గట్టిగా ఉంటుంది. 2. చిన్న ఐబ్రో సీజర్స్ తెచ్చుకోండి. ఎందుకంటే, థ్రెడింగ్ కి ముందు ఐబ్రోస్ ని ట్రిం చెయాలి. ఈ సీజర్స్ చిన్నగా ఉండాలి, షార్ప్ గా ఉండాలి. 3. ఐబ్రో బ్రష్ కావాలి. అది క్లీన్ గా ఉండాలి. 4. ఐబ్రో పెన్సిల్ రెడీగా పెట్టుకోండి. మీకు కావాల్సిన షేప్ డ్రా చేసుకోవడానికి పనికొస్తుంది. మీ ఐబ్రోస్ కంటే డార్కర్ షేడ్ లో ఉన్న పెన్సిల్ తీసుకోండి. ఈ పెన్సిల్ మార్క్ మేకప్ రిమూవర్తో కానీ, వాటర్తో కానీ పోయేలా ఉండాలి. అది కూడా చెక్ చేసుకోండి. 5. అలోవెరా జెల్ గానీ, ఐస్ క్యూబ్స్ కానీ దగ్గరగా పెట్టుకోండి. థ్రెడింగ్ అయిన తర్వాత ఇవి అప్లై చేస్తే హాయిగా ఉంటుంది. థ్రెడింగ్‌కి ముందు.. 1. మంచి లైటింగ్ ఉన్న రూమ్‌లో అద్దానికి ఎదురుగా వస్తువులన్నీ పెట్టుకుని కూర్చోండి. 2. ముందు ఐబ్రో బ్రష్ తో మీ కనుబొమ్మలని పైకి దువ్వండి. ఇప్పుడు మీ ఐబ్రోస్‌లో ఒక పార్ట్ ని బ్రష్‌తో హోల్డ్ చెయ్యండి. బ్రష్ దాటి ముందుకి వచ్చిన హెయిర్ ని సీజర్స్ తో జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడు ఐబ్రోస్ ని కిందకి దువ్వి మళ్లీ ఇలానే చేయండి. ఇలా రెండు ఐబ్రోస్‌ని పూర్తిగా ట్రిం చేసిన తరువాత వాటిని మామూలుగా దువ్ండి. ఇప్పుడు మీ ఐబ్రోస్ క్లీన్‌గా, నీట్‌గా కనపడతాయి. 3. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ తో మీకు కావాల్సిన షేప్ డ్రా చేసుకోండి. రెండు కనుబొమలూ ఒకే షేప్ లో డ్రా చేసుకున్నారు కదా అని డబల్ చెక్ చేసుకోండి. థ్రెడ్ చేయటం.. 1. మీరు తయారు గా పెట్టుకున్న థ్రెడ్ ని తీసుకుని రెండు అంచులూ గట్టిగా ముడి వెయ్యండి. 2. దీన్ని ఒక వైపు కదలకుండా పట్టుకుని రెండో వైపు నాలుగైదు సార్లు తిప్పండి. ఇప్పుడు మీ థ్రెడ్ కి మధ్యలో ఒక మెలిక వస్తుంది. 3. ఈ థ్రెడ్ మధ్యలో ని మెలిక దగ్గరగా వచ్చేటట్లూ, దూరం జరిగేటట్లూ ప్రాక్టీస్ చెయ్యండి. ఈ ట్విస్ట్‌ని చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గానీ ఈజ్ రాదు. ఈ మెలిక మధ్యలోనే ఐబ్రో హెయిర్ ఉంచి థ్రెడ్ చేస్తాం. కాబట్టి ఓపిగ్గా ప్రాక్టీస్ చెయ్యండి. 4. ఇప్పుడు ఈ మెలిక మీ ఐబ్రో మీదకు వచ్చేలా గట్టిగా, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ మెలిక మధ్యలో మీరు రిమూవ్ చేయాలనుకున్న హెయిర్ ఉంచి ట్విస్ట్ చెయ్యండి. ఎప్పుడూ హెయిర్ గ్రోత్ ఉన్న డైరెక్షన్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లోనే థ్రెడ్ చేయాలని గుర్తు పెట్టుకోండి. 5. ఒక సెక్షన్ హెయిర్ రిమూవ్ చేశాక మరో సెక్షన్ రిమూవ్ చెయ్యండి. ఇలా జాగ్రత్తగా రెండు ఐబ్రోస్ థ్రెడ్ చేయండి. 6. చివరగా అలోవెరా జెల్ గానీ, ఐస్ పాక్ కానీ మీ ఐబ్రోస్ మీద అప్లై చెయ్యండి. ఈ థ్రెడింగ్ ఎంత స్కిల్ ఫుల్‌గా చేసినా అక్కడ స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఓ గంట తర్వాత ఇరిటేషన్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరిగ్గా రాలేదనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్ చేసుకోండి. 7. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉన్నాయనిపిస్తే వాటిని ఐబ్రో పెన్సిల్ తో ఫిల్ చేసెయ్యవచ్చు. కేవలం ఐబ్రోస్ మాత్రమే కాదు.. ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ చిన్, ఇలా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు మీరుగానే బ్యూటీ పార్లర్ వెళ్లే అవసరం లేకుండానే అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడమే కాకుండా, ఐబ్రోస్‌ని షేప్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ప్రాక్టీస్ చేయండి..


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2X9RhQG

NTR Jayanthi: దుష్టశక్తులతో పోరాడే ధైర్యం ఇవ్వండి, మీలాంటి వారు అవసరం: పూనమ్ కౌర్ వీడియో వైరల్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘన నివాళి అర్పించారు. మే 28 కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్‌లోని ఘాట్ వద్ద ఘన నివాళి ఘటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా.. జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉండటంతో ఎన్టీఆర్ ఘాట్‌కి రాకుండా ఇంటిలోనే తాత ఎన్టీఆర్‌కి నివాళి అర్పించారు. ఈ తరుణంలో హైదరాబాద్ వచ్చిన ప్రముఖ నటి ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ స్వర్గం నుంచి నన్ను ఆశీర్వదించండి.. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యం ప్రసాదించండి.. మానవత్వం కరువైన ఈ రోజుల్లో మీలాంటి లీడర్, యాక్టర్ అవసరం ఎంతో ఉంది’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జయింతి సందర్భంగా పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా పీకే లవ్ పేరుతో ట్వీట్లు చేస్తున్న పూనమ్ తాజా ట్వీట్‌పై కొంతమంది స్పందిస్తూ.. లవ్ యూ వదినగారూ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. ‘అన్నా వీళ్లు నిజంగానే వదిన అని ఫిక్స్ అయిపోయారు’ అంటూ జోక్‌లు పేల్చుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZJCr5b

బ్రేకింగ్ న్యూస్: శృంగార తార 'క్లైమాక్స్' రేటు డిసైడ్ చేసిన వర్మ.. సంచలన ప్రకటన

సంచనల దర్శకుడు '' రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ద్వారా అలజడి సృష్టించిన ఆయన.. ఇక ఈ మూవీ ట్రైలర్, రిలీజ్ డేట్, సినిమా చూడటానికి కావాల్సిన సొమ్ము ఎంతో చెబుతూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందులో ఈ వివరాలన్నీ పొందుపర్చారు. గతంలోనే 'క్లైమాక్స్' సినిమాను ఓటీటీ వేదికపై RGVWorldTheatreలో మే 29వ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తా అని ప్రకటించిన వర్మ.. దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా 'క్లైమాక్' సినిమాను ఆపలేరని తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ మాటను తీసి గట్టున పెట్టేసిన ఆయన బ్రేకింగ్ న్యూస్ అంటూ మరో డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించాడు. '' 'క్లైమాక్స్' మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా. ఇక ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ రేపు (మే 30) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నా. గెట్ రెడీ'' అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన పెట్టిన ఈ ట్వీట్‌పై ఫన్నీ మీమ్స్‌తో మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. Also Read: క్రియేటివిటీకి పదును పెడుతూ కరోనా పరిస్థితులను కూడా తనకు అనువుగా మార్చుకొని శృంగార తార మియా మాల్కోవాను 'క్లైమాక్స్' సినిమా ద్వారా మరోసారి రంగంలోకి దించుతున్నారు వర్మ. గతంలో కూడా ఇదే మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ సారి ఎలాంటి సంచలనాలు తీసుకొస్తాడో చూద్దాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zvGG9P

SpaceX Crew Dragon Demo-2 Launch: How to Watch Live, Timings, More

After a delay, NASA and SpaceX are now set to try to launch astronauts to the the International Space Station (ISS) on Saturday. It will be the first mission to launch astronauts from the American...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gnN8A2

A New Star Wars VR Experience Is in the Works

We're getting a new Star Wars VR experience. ILMxLAB and Oculus are developing Star Wars: Tales from the Galaxy's Edge, which ties into the theme park attraction and is set between Star Wars: The...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ddIRgx

Amazon to Offer Permanent Jobs to 125,000 Temp Hires

Amazon on Thursday said it is offering permanent jobs to 125,000 of the temporary workers hired to handle surging use of its online shopping service due to the pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZPMANA

Corona Virus: ఇది ఆరంభం మాత్రమే.. మోషన్ పోస్టర్‌తో ఆలోచనలో పడేసిన ప్రశాంత్ వర్మ

యువ దర్శకుడు తన మూడో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కొత్త టేస్ట్ పరిచయం చేసి మెప్పు పొందిన ప్రశాంత్ వర్మ.. ఆ తర్వాత 'కల్కి' మూవీతో రెండోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఇప్పుడు తాజా పరిస్థితులు, కరోనా విలయతాండవం అంశాన్ని తీసుకొని మూడో సినిమాతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని ప్రకటించిన ఆయన, తాజాగా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, ప్రీ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. నిన్న (మే 28) మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ.. నేడు (మే 29) ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. నిజమైన సంఘటనల ప్రేరణతో ప్రశాంత్ వర్మ మూవీ అని పేర్కొంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆయన కరోనా వైరస్ ఆరంభ దశలోనే ఉందని చెప్పడం గమనార్హం. కూడలి వద్ద ఉన్న సిగ్నల్‌పై ''స్టే హోమ్.. స్టే సేఫ్'' అని రాసి ఉండటం, నడిరోడ్డుపైనే శవాలు పడి ఉండటం ఈ మోషన్ పోస్టర్‌లో ఆసక్తికర అంశాలుగా మారాయి. దీంతో ఈ మూవీ ద్వారా ప్రశాంత్ వర్మ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. దేశంలో లాక్‌డౌన్ పూర్తిగా అమల్లోకి రాకముందే ప్రశాంత్ వర్మ ఈ మూవీకి సంబంధించిన 40 శాతం షూటింగ్‌ పూర్తి చేశాడట. కరోనా వైరస్ భారత్‌కు రాకముందే.. చైనాలో పరిస్థితిని తెలుసుకుని కథ సిద్ధం చేసుకున్నాడట ఈ యువ దర్శకుడు. ఏదేమైనా తొలి రెండు సినిమాల్లోనూ వినూత్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. తన మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36DXXti

Moto G8 Power Lite to Go on Sale in India Today at 12 Noon

Moto G8 Power Lite by Motorola is set to go on sale in India today. The smartphone will be available for purchase through Flipkart at 12pm (noon).

from NDTV Gadgets - Latest https://ift.tt/3gxOR66

OnePlus 8 Special Limited Sale at 12pm Today: Launch Offers

The OnePlus 8 special limited sale will begin at 12pm IST on Amazon India and OnePlus.in. Launch offers include Rs. 2,000 off for SBI EMI customers, additional Rs. 1,000 Amazon Pay cashback for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZMxjNB

Twitter Flags China Spokesman's Tweet on COVID-19

Twitter has flagged a tweet written in March by a Chinese government spokesman that suggested the US military brought the novel coronavirus to China, as the social media platform ramps up...

from NDTV Gadgets - Latest https://ift.tt/2XFrxL1

COVID-19: Why nurses are stressed, sick, angry

'The government lights lamps for nurses but when we demand what's due for us, they don't listen at all.'

from rediff Top Interviews https://ift.tt/2yIxgXX

'We are facing a loss of Rs 15,000 crore per day'

'The government has stopped our earnings due to the lockdown and must do something for our earnings to restart.'

from rediff Top Interviews https://ift.tt/3dbnMDK

నాగబాబు- బాలకృష్ణ ఇష్యూ: తన వ్యాఖ్యలపై మీడియా ముందు మెగా బ్రదర్ రియాక్షన్

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో నాగబాబు- ఇష్యూ హాట్ టాపిక్ అయింది. కరోనా కల్లోల పరిస్థితుల నుంచి బయటపడటం, థియేటర్స్ రీ ఓపెన్, షూటింగ్స్ రీ ఓపెన్ లాంటి అంశాలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకనిర్మాతలంతా కలిసి ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్ళు భూములు పంచుకున్నారా? అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మెగా బ్రదర్ ఎంటరై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించారు. దీంతో ఈ ఇష్యూపై చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్‌ నాగబాబుతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో మాట్లాడిన నాగబాబు తన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఆ సమావేశానికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదా? అని ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన నాగబాబు.. ఆయనను చర్చలకు పిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, అలాగే ఆయనపై నెగెటివ్ ఒపీనియన్, శత్రుత్వం లేదని.. గతంలో కూడా బాలకృష్ణను కమెడియన్ అని తాను అనలేదని నాగబాబు చెప్పారు. తనను మీటింగ్‌కు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించడంలో తప్పు లేదని, అయితే భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరైంది కాదని చెప్పారు. సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదని, వీళ్ళతో పాటు ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఉన్నాయని అన్నారు. మీటింగ్‌కు, ఫ్యామిలీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Bg2uqx

Infinix Hot 9, Infinix Hot 9 Pro Launching in India Today at 12 Noon

Infinix Hot 9 series, including the Infinix Hot 9 and the Infinix Hot 9 Pro, will launch in India today at 12pm (noon). The launch was previously teased by the company through its Twitter handle.

from NDTV Gadgets - Latest https://ift.tt/2zyvh9g

Wednesday, 27 May 2020

Samantha: పూజా హెగ్గే ఇన్‌స్టా‌లో సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ఇన‌స్టాగ్రామ్ వేదికపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది పూజ మాత్రం కాదు. పూజా ఇనస్టా ఎకౌంట్ పొద్దున్న హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఆమె ఎకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్ ఇలా సమంతపై అభ్యంతరకర పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పూజా తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది. తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్‌ టీమ్‌ తనకు తెలిపిందని ఆమె ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులకు చెప్పింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు మరో ట్వీట్ చేసింది పూజా. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్‌ సరి చేసిందని తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే మరో ట్వీట్ చేసింది. తన డిజిట్‌ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించానని తెలిపింది పూజా. 2014 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుంద’ సినిమాతో పూజా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 1990లో పుట్టిన పూజా ఎంకామ్ చదివింది. 2010లోని విశ్వసుందరి పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. పూజ సొంతూరు కర్నాటకలోని మంగుళూరు. కానీ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. తొలిసారిగా 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో పూజాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ భామ ఇటు టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36JfjVW

Apple Enables Custom Configurations for Mac Computers in India

Apple has started allowing customers in India to configure iMac, MacBook Air, MacBook Pro, and other Mac computers based on their requirements.

from NDTV Gadgets - Latest https://ift.tt/2X6bWoK

Canada Judge Rules Huawei CFO's Extradition Case Can Proceed

A Canadian judge ruled Wednesday the U. extradition case against a senior Huawei executive can proceed to the next stage, a decision that is expected to further harm relations between China and...

from NDTV Gadgets - Latest https://ift.tt/2TNfGtb

Huami Amazfit T-Rex Smartwatch Launching in India Soon

Xiaomi-backed Huami will be launching its Amazfit T-Rex smartwatch in India soon. The watch has been teased on Amazon along with its specifications that include military certification, AMOLED display,...

from NDTV Gadgets - Latest https://ift.tt/3c9mlEj

In U-Turn, Henry Cavill Might Return as Superman: Reports

Henry Cavill's Superman could be back. It won't be a Man of Steel sequel, Wonder Woman 1984, The Suicide Squad, or The Batman.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dbmGro

Kerala's New Liquor App 'BevQ' Goes Live on Google Play Store

BevQ, Kerala's liquor sale virtual queue management app, is finally available to download via Google Play Store for Android users. The much-awaited Kerala beverages app is provided by Kerala State...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gtNyVz

Google Maps Ramps Up Support for Local Businesses

Google's popular map service on Wednesday added more ways for people to engage with local businesses struggling to survive the economic hit of the coronavirus pandemic.

from NDTV Gadgets - Latest https://ift.tt/2yJAN8A

OnePlus 8 Series Sale in India Postponed, Special Sale Announced Instead

While a full-fledged sale for the OnePlus 8 Pro and OnePlus 8 will not be conducted tomorrow, there will be a special limited sale across online and offline channels for just the OnePlus 8 model.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Xa4GrK

Facebook Denies Sidelining Research on Site's 'Divisiveness'

Facebook on Wednesday defended itself against a report that it shelved internal research indicating that it was dividing people instead of bringing them together.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZHtdpQ

శ్యామ్ కె నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు: పోలీసులు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఓ నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నటి ఫిర్యాదు మేరకు శ్యామ్ కె నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఎస్.ఆర్.నగర్ పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఆయనకు సమన్లు మాత్రమే పంపించారు. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనతో సహజీవనం చేశారని.. అయితే ఇప్పుడు తనను పెళ్లి చేసుకోనని మోసం చేశారని ఫిర్యాదులో ఆ నటి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ‘‘బుధవారం ఉదయం ఒక సినీ నటి సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఫిర్యాదు చేశారు. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి శారీరకంగా దగ్గరయ్యారని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంలేదని ఆమె ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన తరవాత మేం శ్యామ్‌ను ప్రశ్నించడానికి పిలిచాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది’’ అని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు. Also Read: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ నటితో శ్యామ్ ఆరు నెలలు సహజీవనం చేశారు. ఇటీవల వీరి మధ్య దూరం పెరిగిందన్నారు. ఆ నటి ఫిర్యాదు మాత్రమే చేశారని, శ్యామ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ‘‘ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచాం. వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వారు సెటిల్‌మెంట్ చేసుకోకపోతే శ్యామ్ కె నాయుడుపై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేస్తాం’’ అని ఏసీపీ తిరుపతన్న స్పష్టం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XAlpDP

మహేష్ బాబులో ఇన్ని మార్పులా ? మరీ 20 ఏళ్ల కుర్రాడిలా!

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు లాక్‌డౌన్‌లో పూర్తిగా మారిపోయాడు. కొన్ని నెలుగా ఇంట్లోనే ఉంటూ గ్లామర్ పెంచేస్తున్నాడు. దీనికి ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న ఫోటోలే ఉదాహరణ. అది ఎంతంటే మరీ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించేంతగా మారిపోయాడు. వర్కౌట్, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి ఇంతకు ముందు కంటే అందంగా మారిపోయాడు. తాజాగా తన కూతురు సితారతో కలిసి దిగిన మిర్రర్ సెల్ఫీ ఫొటో ఒకటి బయటకు రావడంతో మహేష్ గ్లామర్ బయటపడింది. ఆ పిక్‌ చూసిన నెటిజన్లంతా నోరెళ్ల బెడుతున్నారు. నిజంగా మహేష్ బాబేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు గౌతమ్‌కు అన్నలా మారిపోయాడని మరి కొందరు అంటున్నారు. సంతూర్ డాడీలా ఉన్నాడంటూ ఇంకొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ సంతూర్ యాడ్ చేసిన విషయం మనకు తెలిసిందే. దీంతో యంగ్ లుక్‌లో మహేష్ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్స్ తర్వాత ఎప్పుడు కుటుంబానికే మహేష్ బాబు ఎక్కువగా సమయం కేటాయిస్తాడు. లాక్‌డౌన్ కావడంతో తన కూతురు, కొడుకుతో కలిసి సరదాగా గడుపుతూ.. ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తన యంగ్ ఏజ్ ఎలా కనిపించాడో అంతలా మారిపోయాడు. దీన్ని చూసిన అభిమానులు మరీ కుర్రాడిలా మారిపోయాడేంటని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన గౌతమ్ కు అన్నయ్యలా ఉన్నాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ గ్లామర్‌తో కనిపించే ప్రిన్స్ ఈ లాక్‌డౌన్‌లో మరింతగా మారిపోయాడు. ఇంట్లోనే ఉండి, ఫిట్ నెస్ ను మరింతగా పెంచుకున్న మహేశ్, ఫిజిక్ తో పాటు తన అందాన్ని కూడా పెంచుకుని మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. కళ్లు తిప్పుకోలేనంత అందంగా మహేశ్ బాబు కనిపిస్తుండగా, తన యంగ్ ఏజ్ లో కూడా ఆయన ఇంతలా ఆకట్టుకునే రూపంతో ఉండి ఉండరని, అంత బాగున్నారని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ ఏజ్ 44 ఏళ్లు. 1975 ఆగష్టు 9న పుట్టాడు. నాలుగు పదుల వయసులో కూడా మహేష్ ఇంత గ్లామర్‌గా ఉండటం చూసి ఇక లేడీస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eqpSzB

US State Takes Google to Court Over Location Tracking

The US state of Arizona filed a lawsuit Wednesday accusing Google of committing fraud by being deceptive about gathering location data.

from NDTV Gadgets - Latest https://ift.tt/2B1GAqC

Bill Gates Conspiracy Theories Echo Through Africa

As the novel coronavirus wreaks global havoc, Bill Gates is the new bete noire for conspiracy theorists worldwide including in Africa where a Kenyan politician's false online post has added major fuel...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gxf3gW

Google Sees Resurgence in State-Backed Hacking Related to COVID-19

Security experts at Alphabet's Google sent 1,755 warnings in April to users whose accounts were targets of government-backed attackers, following a resurgence in hacking and phishing attempts...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gtd7X1

Maharashtra speaker takes on governor for politicking

'These frequent political visits to the governor's residence show the state and the office of the governor in bad light.'

from rediff Top Interviews https://ift.tt/2yEFgcB

ఎన్టీఆర్ జయంతి... అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి

ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా సైతం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌తోను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరు ఎన్టీఆర్‌కు, ఎన్టీఆర్‌ చిరుకు స్వీట్స్ తినిపించే ఫోటోను షేర్ చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్‌ 1981లో ‘తిరుగులేని మనిషి’అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో రతి అగ్నిహోత్రి, ఫటాఫట్ జయలక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవీ వర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కేవీ మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్‌ పాత్రలో, సింగర్ పాత్రలో నటించి మెప్పించారు. 1981 ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలైంది. వెండితెరపైనే కాదు... రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగు జాతి గౌరవం నిలబెట్టేలా తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇటు సినిమాలతోను అటు రాజకీయాలతోను తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయిన సినిమాలతోను లేదంటే విప్లవాత్మక పథకాలతో ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వెండితెరపై పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్.. పౌరాణిక పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. తెరపై రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో రూపాలలో అలరించారు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా కూడా కళామ్మతల్లికి ముద్దుబిడ్డ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3errg57

Jabardasth: జబర్దస్త్ రాకెట్ రాఘవకు పరీక్షలు, స్టాంప్‌తో క్వారంటైన్‌‌కి తరలింపు

మెల్ల మెల్లగా షూటింగ్‌లు మొదలౌతున్నాయి.. దాదాపు రెండు నెలల తరువాత స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే మాట వినిపించబోతుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం తిరిగి షూటింగ్‌కు అనుమతులు లభించడంతో నటీనటులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అయితే కరోనా నిబంధనల్లో భాగంగా కమెడియన్ రాకెట్ రాఘవకి వైద్య పరీక్షలు నిర్వహించారు తెలంగాణ డాక్టర్లు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న జబర్దస్త్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా.. ఏపీ నుంచి హైదరాబాద్‌కి పయనం అయ్యారు . అయితే సూర్యపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెం శివారులోని సరిహద్దు ప్రాంతం వద్ద వైద్యాధికారులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనలో కరోనా పాజిటివ్ లక్షనాలు లేకపోవడంతో హోం క్వారంటైన్ స్టాంప్ వేసి.. ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచించారు. ఇటీవల మరో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కి సైతం ఇదే సరిహద్దు ప్రాంతంలో వైద్య పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XEIK79

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రాం హ్యాక్

ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురి అవుతున్నాయి. ఆ మధ్య పలువురు సీనియర్ హీరోయిన్ల ఎకౌంట్లు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని పూజ తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపింది. 'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ పూజా ట్వీట్ చేసింది. 2014 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుంద’ సినిమాతో పూజా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. నాగ చైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ సినిమా చేసింది. ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’సినిమాలో మెరిసింది. అల్లు అర్జున్‌తో కలిసి దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురములో సినిమాలు చేసింది. అల వైకుంఠపురములో హిట్‌తో పూజా హెగ్డేకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం కూడా కొట్టేసింది. వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోంది పూజా. 1990లో పుట్టిన పూజా ఎంకామ్ చదివింది. 2010లోని విశ్వసుందరి పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. పూజ సొంతూరు కర్నాటకలోని మంగుళూరు. కానీ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. తొలిసారిగా 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో పూజాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ భామ ఇటు టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zt2m6v

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk