Saturday, 4 December 2021

Vitamin She: 300 మిలియన్ వ్యూస్‌ కొల్లగొట్టిన ‘విటమిన్ షి’.. MXPlayer‌లో చిన్న చిత్రానికి పెద్ద విజయం

కంటెంట్ ఉన్న కథ ఎక్కడున్నా ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది అనడానికి ‘’ అనే చిన్న సినిమానే పెద్ద ఉదాహరణ. పేపర్ బాయ్ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ ఫిల్మ్.. 2021 జనవరిలో ఎంఎక్స్ ప్లేయర్‌ (MX Player) విడుదలైంది. అయితే ఈ సినిమాకి ఆడియన్స్‌ నుంచి అనూహ్య స్పందన లభించి.. 300 మిలియన్ వ్యూస్ మార్క్‌ని చేరుకోవడం విశేషం. ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్‌కి 300 మిలియన్ వ్యూస్ రావడం అనేది బిగ్ సక్సెస్ అనే చెప్పొచ్చు. జీవితం మొత్తాన్ని అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్‌కి అప్పజెప్పేస్తూ.. టెక్నాలజీ మోజులో మనిషి బుర్రకి బూజుపట్టిస్తున్నారు. మనిషికి సహాయకారిగా ఉంటుందనుకున్న స్మార్ట్ ఫోన్ మనిషినే డామినేట్ చేసే స్థితికి వచ్చేసింది. ఎంతైనా స్మార్ట్ ఫోన్ అనేది ఒక మెషిన్ లాంటిదే. మెషిన్స్ నూనెని మాత్రమే తయారు చేస్తాయి కానీ దీపం వెలిగించాలి అంటే చేతులే కావాలి కదా.. ఇలాంటి వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘విటమిన్ షి’ అనే వెబ్ ఫిల్మ్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ఆక్రమిస్తుందనేది ఈ సినిమా మూల కథాంశం. మొబైల్ యుగంలో మనుషుల్ని రీప్లేస్‌మెంట్లు చాలా ఉన్నప్పటికీ హ్యామన్ రిలేషన్స్ & ఎమోషన్స్‌ని రీప్లేస్ చేయడం సాధ్యం కాదని సెటైరికల్‌గా ఈ సినిమాలో కళ్లకి కట్టారు. దర్శకుడు జయ శంకర్ కరోనా వైరస్ అనే కరెంట్ ఇష్యూని టెక్నాలిజీతో లింక్ చేసి సెటారికల్‌గా చూపించారు. కరోనా వైరస్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఐర్లాండ్ శాస్త్రవేత్త వ్యాసాన్ని ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ షాకింగ్ విషయాలను సున్నిత విమర్శలతో సూటిగా సుత్తిలేకుండా చూపించగలిగారు. అయితే దర్శకుడు చెప్పే ప్రతి పాయింట్‌లో ఫన్‌ని జనరేట్ చేస్తూ సెన్సిబుల్ కామెడీ జోడించారు. ఒకవైపు మొబైల్ ఉపయోగాన్ని తెలియజేస్తూనే.. వాటికి అడిక్ట్ అయితే ఎదురయ్యే దుష్పరిణామాలు ఎలా ఉంటాయన్నది చాలా సున్నితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధానంలో చూపించగలిగాడు దర్శకుడు జయ శంకర్. యంత్రాలకు ఉండే ఎమోషన్స్‌ని మరీ శంకర్ రేంజ్‌లో ‘రోబో’ మాదిరిగా చూపించలేదు కానీ.. పరిమిత బడ్జెట్‌తో అపరిమితమైన కామెడీ సెన్స్‌లో చెప్పగలిగారు జయ శంకర్. శ్రీకాంత్ గుర్రం (లియో), ప్రాచీ టక్కర్ (వైదేహి) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ‘విటమిన్ షి’ అనే అల్ట్రా మోడరన్ వాయిస్ అసిస్టెంట్‌ ఫోన్‌ది కీలక పాత్ర. ఆ ఫోన్ వచ్చిన తరువాత తరువాత లియో-వైదేహి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగింది? స్మార్ట్ ఫోన్ వినియోగం మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది? అన్నదే ‘విటమిన్ షి’ కథ. ఈ వెబ్ ఫిల్మ్ ఎంఎక్స్ ప్లేయర్‌ (MX Player)లో ఉంది.. ఇంకా చూడని వాళ్లు ఎవరైనా ఉంటే చూసేయండి.. ఓ వినూత్న కథాంశంతో కూడిన మంచి చిత్రం చూశాం అనే ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZUERAp

No comments:

Post a Comment

'Rahul Would Have Been Wiser Had He...'

'...spent 1/10th of his time at 24, Akbar Road...' from rediff Top Interviews https://ift.tt/8rCaHZV