మాస్ మహారాజా కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘’. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్ పూర్తయితే టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఇక పాటలను విదేశాల్లో చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలకపాత్రలో కనిపించనున్నారు. యథార్థ ఘటన ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 25న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలవుతుంది. రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్. నెలన్నర గ్యాప్‌లోనే రవితేజ హీరోగా నటించిన రెండు సినిమాలు విడులవుతుండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. రవితేజ డ్యూయెల్ రోల్‌లో రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ఖిలాడి ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీని ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి కొనేరు సత్యనారాయణ నిర్మాత. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి వచ్చే ఏడాదికి విడుదలవుతుంది. ఇప్పుడు రవితేజ రెండు సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న ధమాకా. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిర్మితమవుతోంది. మరో వైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న రావణాసుర సినిమాను రీసెంట్‌గానే అనౌన్స్ చేశారు. రామారావు ఆన్ డ్యూటీ అలా పూర్తవుతుందో లేదో.. రావణాసుర షూటింగ్‌ను రవితేజ షురూ చేసేస్తాడు. రావణాసుర సినిమాలో లాయర్ పాత్రలో మెప్పించడానికి రవితేజ రెడీ అవుతున్నారు. దీని కోసం లాయర్స్‌ను కలిసి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో రవితేజ భాగం అవుతుండటం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో క్రాక్‌తో సెన్సేషనల్ హిట్ కొట్టిన రవితేజ.. ఏకధాటిగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఒకవైపు సినిమాలను పూర్తి చేస్తూనే మరో వైపు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు. ఇవన్నీ కాకుండా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ నటించబోతున్నట్లు ప్రకటన కూడా వచ్చిన సంగతి విదితమే. ఇలా వరుస ప్రాజెక్టులతో రవితేజ తన అభిమానులకు వచ్చే ఏడాది మంచి ఫీస్ట్‌ను ఇవ్వబోతున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ooxg6A
No comments:
Post a Comment