పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పీడును అందుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. అది కూడా ఒక వైపు పాన్ ఇండియా రేంజ్ సినిమాలను చక చకా పూర్తి చేస్తున్నాడు. మరో వైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడో లేదో.. కొత్త సినిమాను మొదలెట్టేశాడు. ఆ కొత్త సినిమా ఎవరిదో కాదు.. దర్శకత్వంలో రూపొదుతోన్న Project K. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను అమితాబ్ బచ్చన్ సహా కీలక పాత్రధారులపై చిత్రీకరించారు. Project K అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆదివారం (డిసెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో పాల్గొనడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హైదరాబాద్ చేరుకుంది. సెకండ్ షెడ్యూల్‌ను అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనె తదితరులపై చిత్రీకరించబోతున్నారని సమాచారం. బాహుబలిగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు సినిమా రేంజ్‌ను పెంచడంలో భాగమైన కథానాయకుడు ప్రభాస్, మహానటితో ప్రేక్షకుల ప్రశంసలే కాదు.. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత ఇది వరకే చెప్పారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తారని కూడా టాక్ నెట్టింట జోరుగా వినిపిస్తోంది. రజినీకాంత్ కాలా, కబాలి సహా పలు విజయవంతమైన చిత్రాలకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ Project Kకు సంతోష్ నారాయణ్ సంగీతం అంటే తనకు కెరీర్ పరంగా ఎంతగానో హెల్ప్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత సి.అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షనల్ మూవీగా Project K రూపొందనుంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ పీరియాడిక్ లవ్‌స్టోరి రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవని 14న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీనికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అలాగే నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కాక ముననుపే ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి చిత్రాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dpEnVP
No comments:
Post a Comment