సూపర్‌స్టార్ మహేష్ బాబు.. యంగ్ టైగర్ మధ్య మంచి అనుబంధం ఉంది. మహేష్‌ను అన్నయ్య అని ఎన్టీఆర్ సంబోధిస్తుంటారు. మహేష్ బాబు టైటిల్ పాత్రలో నటించిన భరత్ అనే నేను చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ కలుసుకుని అభిమానులు అలరించారు. ఇంతకీ వీరిద్దరూ కలుసుకున్న ప్లేస్ ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో. ఈ ప్రోగామ్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను కూడా ఈ షోలో ఇంటర్వ్యూస్ చేస్తూ వస్తున్నారు తారక్. అందులో భాగంగా రీసెంట్‌గా మహేష్ బాబుని కూడా హాట్ సీట్‌పై కూర్చో బెట్టారు తారక్. ఆ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమై అభిమానులను అలరించింది. ఇందులో తారక్ అడిగిన ప్రశ్నలకు మహేష్ సమాధానం చెప్పారు. మధ్య మధ్యలో ఒకరిపై ఒకరు జోకులేసుకున్నారు.ఈ క్రమంలో మహేష్ తన తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించడం విశేషం. ఆద్యంతం షో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఓ సందర్భంలో మహేష్ తన కుమార్తె సితారతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ‘‘తనతో అనుబంధం రోజు రోజుకీ పెరుగుతుంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. తనకు తండ్రి కావడం గొప్ప అనుభూతినిస్తుంది’’ అని తెలిపారు. అప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ కూతుళ్లు ఉన్నవాళ్లను చూసి తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని అన్నారు. నాకు ఇద్దరూ కొడుకులే. కూతుళ్లు లేకపోవడం వెలితిగా ఉంటుందని ఈ సందర్భంగా తారక్ అన్నారు. ఈ షోలో మహేష్ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులులో ఇదే చివరి ఎపిసోడ్. తనకు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా విషయాలు తెలిశాయని, చాలా మంది స్నేహితులను కలుసుకున్నానని, అవన్నీ మిస్ అవుతున్నానని చెప్పిన తారక్ తనను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవదాలు తెలిపారు. ఈ షో కేవలం ఒకే ఒక విజేత.. రాజా రవీంద్ర అనే వ్యక్తి మాత్రమే కోటి రూపాయలను గెలుచుకున్నారు. మరి ఎవరు మీలో కోటీశ్వరులు నెక్ట్స్ సీజన్ ఉంటుందా? ఉంటే దాన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తారా? లేక మరేవరైనా హోస్ట్ చేస్తారా? అనే సంగతి తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DrtEVE
No comments:
Post a Comment