ఓ యంగ్ హీరోను మరో యంగ్ హీరో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడం, దాన్ని బహిర్గతంగా చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇంతకీ ఏ యంగ్‌హీరోను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు? ఎవరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు? అనే వివరాల్లోకి వెళితే, హీరో నాగశౌర్యను శర్వానంద్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. అసలు నాగ శౌర్యను స్ఫూర్తిగా తీసుకోవాల్సినంత ఏం చేశాడబ్బా అనే సందేహం రాక మానదు. అయినా శర్వానంద్‌కు నాగ శౌర్య సూర్ఫిని ఇచ్చిన విషయం ఏంటో తెలుసా? లుక్. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. డిసెంబర్ 10న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా కోసం నాగ శౌర్య సిక్స్ ప్యాక్ చేశాడు. తనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న శర్వానంద్ సిక్స్ ప్యాక్ లుక్ కోసం కష్టపడుతున్నాడు. ఆ విషయాన్నే లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌పై చెప్పాడు . లక్ష్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శర్వానంద్ మాట్లాడుతూ ‘‘స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు చేయాలంటే చాలా కష్టం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన తెలుగు సినిమాలు మజిలీ, జెర్సీ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాలు చేసేటప్పుడు నటుడుకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ధైర్యం కూడా కావాలి. ఆ పరంగా చూస్తే నాగశౌర్యకు చాలా ధైర్యం ఉంది. తను లక్ష్య సినిమా కోసం పడ్డ కష్టం స్క్రీన్‌పై చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలు తర్వాత నేను సిక్స్ ప్యాక్ వచ్చిన తర్వాతే నెక్ట్స్ సినిమా చేస్తాను. నాగశౌర్య అందరితో నవ్వుతూ జెన్యూన్‌గా ఉంటాడు. ఇండస్ట్రీలో నిలబడటం ఎంతో కష్టమో యాక్టర్స్‌గా మాకు తెలుసు. మా బాస్ చిరంజీవిగారు చెప్పినట్లు తప్పకుండా సూపర్‌స్టార్ అవుతాడు. తను బాలీవుడ్‌కి కూడా వెళ్లాలనుకుంటున్నాను. కేతికా శర్మ రొమాంటిక్ తర్వాత తెలుగులో చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమాతో వారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. విలువిద్య నేపథ్యంలో (ఆర్చరీ) లక్ష్య సినిమా తెరకెక్కింది. కేతికా శర్మ హీరోయిన్. జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం నాగ శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ చేశాడు. సాలిడ్ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నాగ శౌర్య రిలీజ్ అవుతున్న లక్ష్య సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఇదే ఈవెంట్‌లో సినిమా ఇండస్ట్రీకి అఖండ సినిమా సాధించిన సక్సెస్‌తో పూర్వ వైభవం వచ్చినట్లుగా ఉందని చెప్పిన శర్వానంద్.. జై బాలయ్య అని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3orzKB7
No comments:
Post a Comment