చేతిలో ఇప్పుడున్న ఒకే ఒక్క భారీ ప్రాజెక్ట్ హరి హరి వీర మల్లు. పవర్ స్టార్ క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇది వరకే ఓ షెడ్యూల్‌లో నిధి పాల్గొంది. పవన్ కళ్యాణ్‌తో సీన్స్‌లో నటించింది. సెట్‌లో పవన్ కళ్యాణ్ ఉండే పద్దతి, మాట్లాడే తీరుకు నిధి అగర్వాల్ ఫిదా అయిపోయిందట. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. హరి హర వీర మల్లు షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడితే.. మధ్యలో బీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్ డేట్లను కేటాయించాడు. ఇక ఆ సమయంలోనే క్రిష్ కొండపొలం అనే సినిమాను తీసేశాడు. అయితే హరి హరి వీర మల్లు సినిమా ఇప్పుడు మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అయింది. ఈ మేరకు నిధి అగర్వాల్ అంతా సిద్దంగా ఉన్నట్టుంది. సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆగలేకపోతోన్నానంటూ నిధి అగర్వాల్ తన ఆనందాన్ని తెలియజేసింది. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ మూవీని పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ చేసే గుర్రప్పు స్వారీలు మాత్రం సినిమాకే హైలెట్ అవుతాయని తెలుస్తోంది. మొత్తానికి క్రిష్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక మరోవైపు నిధి అగర్వాల్ గల్లా అశోక్ తెరంగేట్రం చేస్తోన్న ‘హీరో’ సినిమాలో నటిస్తోంది. ఇది వరకే వదిలిన పాటలు, టీజర్ అన్నింట్లో ఈ జోడి ఆకట్టుకుంది. ఇక తమిళం, బాలీవుడ్ ఇలా అన్నింట్లోనూ నిధి ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dpWvil
No comments:
Post a Comment