సోషల్ మీడయాలో గురించి చెబుతూనే ఉంటుంది. ఆద్య చేసే అల్లరి, ఆమెలోని టాలెంట్‌ను అందరికీ తెలియజేస్తుంటుంది. అలా ఆద్య ఫోటోగ్రఫీ, సంగీతం టాలెంట్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఆద్యకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులున్నట్టు కనిపిస్తోంది. రేణూ దేశాయ్ కూడా ఎక్కువగా ఇండస్ట్రీ వాళ్లతో స్నేహంగా ఉండదు. సునీత, ఫ్యామిలీ, అడివి శేష్ వంటివారితోనే సన్నిహితంగా ఉంటుంది. ఉత్తేజ్ ఫ్యామిలీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు రేణూ దేశాయ్ వెళ్తుంటుంది. ఇక రేణూ దేశాయ్ తీయబోయే సినిమాలో కూడా నటించబోతోందట. అందుకే మరింత సాన్నిహిత్యం ఏర్పడినట్టుంది. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన సినిమాను మొదలుపెట్టాలని గత రెండేళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది. రైతు సినిమా కోసం వేసవి కాలం వరకు వేచి చూస్తూనే ఉంటోంది. అలా కరోనా, లాక్డౌన్ అంటూ షూటింగ్‌లు క్యాన్సిల్ అవుతూనే వచ్చాయి. అలా ఇప్పటి వరకు ఆ సినిమా ఇంకా పట్టాలెక్కనేలేదు. సినిమా విషయాలు కాసేపు పక్కన పెడితే.. తాజాగా పాట ఉత్తేజ్ తన ఫాలోవర్లతో నెట్టింట్లో చాట్ చేసింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టేసింది. ఇందులో భాగంగా కొందరు ఆద్యకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. దీంతో ఆద్యతో దిగిన ఓ సెల్ఫీని షేర్ చేసింది పాట ఉత్తేజ్. దాంతో పాటు ఆద్య గుణగణాల మీద కామెంట్ చేసింది. అద్బుతమైన ప్రతిభ ఉన్న క్యూట్ లిటిల్ గర్ల్.. క్యూటీ పై.. లవ్యూ ఆది అంటూ పాట ఉత్తేజ్ చెప్పుకొచ్చింది. ఇక ఆ పోస్ట్‌ను రేణూ దేశాయ్‌కు ట్యాగ్ చేసేసింది. మరో పోస్ట్‌లో తన నెక్ట్స్ సినిమా రేణూ దేశాయ్ ఆంటీతోనే అని పాట ఉత్తేజ్ తెలిపింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oljL7r
No comments:
Post a Comment