Saturday, 25 September 2021

Ravi Teja - Khiladi: రవితేజ ‘ఖిలాడి’ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ..!

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై రీసెంట్‌గా కొన్ని వార్త‌లు వినిపించాయి. సినిమాకు ఫైనాన్సియ‌ల్ ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, ఆ కార‌ణంతో సినిమా షూటింగ్ ఆగిపోయింద‌ని స‌ద‌రు వార్త‌ల స‌మాచారం. అయితే అప్పుడు ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు. లేటెస్ట్‌గా ఈ వార్త‌ల‌పై స్పందించిన ఖిలాడి టీమ్ అప్‌డేట్ ఇచ్చింది. సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌రణంతా పూర్తయ్యింద‌ని, రెండు పాటలు మాత్ర‌మే చిత్రీక‌రించాల్సి ఉంద‌ని యూనిట్ తెలియ‌జేసింది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ర‌వితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్నాడు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స‌త్య‌నారాయ‌ణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ష‌సుడు సినిమాను ర‌మేశ్ వ‌ర్మ‌తో నిర్మించిన ఈ నిర్మాత, ర‌వితేజ‌తో భారీ సినిమానే తెర‌కెక్కిస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డింది. ఈ ఏడాది కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత జ‌న‌వ‌రికి విడుద‌లైన చిత్రాల్లో ర‌వితేజ హీరోగా చేసిన‌ క్రాక్ సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఖిలాడి సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వీర వంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌పై న‌మ్మ‌కంతో ర‌వితేజ.. ఖిలాడి రూపంలో మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zGgxOk

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...