Thursday, 1 April 2021

భర్తతో బీచ్ ఒడ్డున చిల్ అయిన మంచు లక్ష్మి.. నాటి జ్ఞాపకాలు తలచుకుంటూ పోస్ట్!!

అదేంటో.. కొన్ని ఫొటోలకు సామాజిక మాధ్యమాల్లో యమ డిమాండ్ ఉంటుంది. అలా కనిపించాయో లేవో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల తాలూకు వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ ఫొటోస్, వీడియోలు తెగ హంగామా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కుమార్తె, నటి తన ఫ్యామిలీ టూర్ ఫొటోలు షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. అందుకు ప్రధాన కారణం ఈ ఫొటోల్లో ఆమె భర్త కనిపించడమే అని చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం నెటిజన్లను పలకరిస్తూనే ఉంటుంది ఈ మంచు వారమ్మాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడమే గాక కెరీర్ సంగతులు, తన వ్యక్తిగత విషయాలు సైతం షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ టూర్ వేసిన ఫొటోలను ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ మధ్య సెలబ్రిటీలంతా ఏ మాత్రం టైమ్ దొరికినా భూతల స్వర్గం మాల్దీవ్స్‌లో వాలిపోతున్న సంగతి తెలిసిందే. కొత్త జంటలతో పాటు సీనియర్ జోడీలు కూడా అక్కడే చేరి చిల్ అవుతున్నారు. రీసెంట్‌గా మంచు లక్ష్మి కూడా అక్కడికి చేరి బీచ్ ఒడ్డున తన తండ్రి మోహన్ బాబు, కూతురు విద్యా నిర్వాణ, భర్త ఆండీ శ్రీనివాసన్‌లతో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. అయితే గతంలోనే ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న మంచు లక్ష్మి.. తాజాగా మరోసారి తన భర్తతో దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేసి మాల్దీవ్స్ ట్రిప్‌ని వార్తల్లో నిలిపింది మంచు లక్ష్మి. ఈ ఫొటోల్లో వైట్ కలర్ షర్ట్, కింద బుల్లి నిక్కరు మాత్రమే ధరించి కనిపిస్తోంది మంచు లక్ష్మి. ఆమె భర్త కూడా వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. అప్పటి అనుభూతులను గుర్తుచేసుకుంటూ ఈ ఫొటోస్ పోస్ట్ చేసింది. మాల్దీవ్స్‌ టూర్‌లో బీచ్ ఒడ్డున భార్య భర్తలిద్దరూ ఎంత ఎంజాయ్ చేశారో తెలుపుతున్న ఈ ఫొటోస్ చూసి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తొలిసారి తన భర్త, కుమార్తెతో కలిసి మంచు లక్ష్మి కనిపించడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3me9BTz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....