Thursday, 1 April 2021

ఆలియా భట్‌కు కరోనా పాజిటివ్.. హీరోయిన్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల కౌంటర్లు

బాలీవుడ్‌లో టాప్ సెలెబ్రిటీలందరూ బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆమీర్ ఖాన్, ఇలా టాప్ హీరోలు కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో తమ అభిమానులను అలర్ట్ చేశారు. ఈ పది రోజుల్లో తమను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అలా మొత్తంగా బాలీవుడ్‌లో ఇప్పుడు కరోనా తాండవం చేస్తోంది. తాజాగా స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడిందని తెలుస్తోంది. తాజాగా అలియా భట్‌కు కరోనా పాజిటివ్ అని సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిపై అలియా క్లారిటీ ఇచ్చారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాకు నేనుగా ఐసోలేట్ అయ్యాను.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు థ్యాంక్స్. మీరు కూడా జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి అంటూ కోరారు. తన ప్రియుడు రణ్ బీర్ కపూర్‌కు పాజిటివ్ అని తేలిన సమయంలోనూ అలియాకు కూడా పాజిటివ్ వచ్చి ఉంటుందని అందరూ భయపడ్డారు. అలా ఆమె నటిస్తోన్న గంగూభాయ్ కథియావాడి, సెట్స్‌లో అందరూ కంగారుపడ్డారు. కానీ ఆప్పుడు అలియాకు పాజిటివ్ అని తేలలేదు. కానీ ఇప్పుడు అలియాకు పాజిటివ్ అని నిర్దారణ అయింది. మొత్తానికి రణ్ బీర్ కపూర్‌కు కరోనా వచ్చి క్వారంటైన్ అయిన సమయంలో అలియా అతన్నీ ఎంతగానో మిస్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగానే ఆమె చెబుతూ కొన్ని పోస్ట్‌లు కూడా చేశారు. తీరా చివరకు కూడా క్వారంటైన్ కావాల్సి వచ్చింది. ఈ ఇద్దరూ కలుసుకున్నారేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అలియా భట్‌కు కరోనా పాజిటివ్ అనే వార్తలు దేశం మొత్తం వైరల్ అవుతున్నాయి. రణ్ బీర్ కపూర్, అలియా భట్‌లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతేడాది కరోనా అనే ఓ మహమ్మారి రాకపోయి ఉంటే తామిద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్లమని రణ్ బీర్ కపూర్ చెప్పిన సంగతి తెలిసింది. అలా ఈ ఇద్దరి పెళ్లికి గతేడాది కరోనా కళ్లెం వేసినట్టైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rHzRa3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....