Thursday 4 February 2021

Zombie Reddy Twitter Review: ఫస్టాఫ్ ఇలా.. సెకండాఫ్ అలా! ఆడియన్స్ రియాక్షన్ చూస్తే..

వైవిద్యభరితమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న యువ దర్శకుడు మరో డిఫరెంట్ స్టోరీ ''ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్ర అప్‌డేట్స్ సినిమాపై సరికొత్త ఆసక్తి రేకెత్తించాయి. పైగా తెలుగులో వస్తున్న తొలి జాంబి సినిమా కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతోంది? జాంబిలను ప్రశాంత్ వర్మ ఎలా చూపించనున్నారు? అనే కుతూహలం ప్రేక్షకుల్లో నెలకొంది. నేడు (ఫిబ్రవరి 5) ఈ మూవీ రిలీజ్ కానుండగా, గత రాత్రి ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్ పడటంతో అక్కడి ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ''నేనైతే నా శక్తి మేర ప్రయత్నం చేశాను. ఇక అంతా మీ చేతిలో ఉంది. ఆట మొదలు కాబోతోంది'' అని ట్వీట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు జాంబిలను పరిచయం చేసి బాక్సాఫీస్ మీద దాడి చేయడానికి ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగారు. సెన్సార్ బోర్డు నుంచి UA సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ 2 గంటల 5 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాపై విదేశాల్లోని ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం సినిమాకు కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది. ట్విట్టర్ ద్వారా మూవీపై రియాక్ట్ అవుతున్న యూఎస్ ఆడియన్స్.. 'జాంబి రెడ్డి' మూవీ ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. వెండితెరపై జాంబిలను చూపించడంతో ప్రశాంత్ వర్మ తన విలక్షణతను పదును పెట్టారనే ట్వీట్స్ వస్తున్నాయి. ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీ సీన్స్‌తో కథ నడిపించి ఇంటర్వెల్‌లో జాంబిలను ఎంటర్ చేశారట. అక్కడి నుంచి కథను సానబట్టి సెకండాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో థ్రిల్ చేశారని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికైతే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఓ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తోందని ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో నటించగా.. రఘుబాబు, పృథ్వీ రాజ్, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషించారు. కె. రాబిన్‌ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. మరికొద్ది సేపట్లో 'సమయం' నుంచి 'జాంబి రెడ్డి' పూర్తి రివ్యూ రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cINsKA

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...